36.5 C
India
Friday, April 10, 2026
More

    గోనె ప్రకాశ్ టార్గెట్ ఏంటీ.. ఎందుకీ గోల..?

    Date:

    gone-prakash

    gone-prakashగోనె ప్ర‌కాశ్ కాంగ్రెస్ పార్టీలో ఒక‌ప్పుడు సీనియ‌ర్ లీడ‌ర్. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనుంగు అనుచ‌రుడు. ప‌లుమార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే గోనె ప్ర‌కాశ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో అంత‌గా యాక్టివ్‌గా లేరు. అందుకే ఆయ‌న‌కు మెయిల్ స్ట్రీం మీడియా పెద్ద‌గా ప్ర‌యార్టీ ఇవ్వ‌కున్నా..యూట్యూబ్ ఛానెల్స్ ముందుకొచ్చిన హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

    రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్న స‌మ‌యంలో నేత‌ల అంత‌ర్గ‌త సంభాష‌ణల్లో జ‌రిగిన వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ప్ర‌స్తుతం గోనె ప్ర‌స్తావిస్తూ..గోల గోల చేసేస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌న‌కున్న అనుబంధం, కేసీఆర్ అప్ప‌ట్లో చేసిన లీల‌లు ఇలా అంద‌రి గుట్టును విప్పేస్తున్నారు. ఆద‌ర్శ్ న‌గ‌ర్‌,ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో త‌న వ‌ల్ల ల‌బ్ధి పొందిన వారి వివ‌రాల‌ను కూడా బయటపెడుతున్నారు. ఓ ర‌కంగా గోనె ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానెల్ లో రంగ ప్ర‌వేశం చేసి ఎవ‌రి ఇజ్జ‌త్‌ను క‌చ‌రా చేసేస్తాడోన‌ని ప‌లువురు గాబార ప‌డుతున్నారు కూడా.

    అయితే ఇంతలా యూట్యూబ్ వేదిక‌గా గోల చేస్తున్న గోనె గోలేంట‌నే విష‌యాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తే ఇంట్రెస్టింగ్ అంశాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. ప్ర‌స్తుతానికి గోనె త‌న రాజ‌కీయ గురువుగా చెప్పుకుంటున్న దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇప్పుడు బ్ర‌తికిలేరు. ఆయ‌న కుమారుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జెంట్  ఏపీ సీఎంగా ఉన్నారు. ఇటు కేసీఆర్ తో ప‌రిచ‌యం ఉన్న‌ట్లు గోనె చెబుతున్న ఆయ‌న ప‌ట్టించుకునే ప‌రిస్థితులు లేవు.

    అంతేకాక గోనె ప్ర‌జెంట్ హైద‌రాబాద్‌లో ఒక హాస్ట‌ల్ లో నివాస‌ముంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. దీంతో ఆయ‌న గుర్తింపు లేని నాయ‌కుడుగా మారిపోయారు. ఈ నేప‌థ్యంలోనే త‌న రాజ‌కీయ అస్థిత్వంపై చ‌ర్చ జ‌రిగేందుకే మెయిన్ స్ట్రీం మీడియా పిలువ‌కున్నా..ఆయ‌న యూట్యూబ్ వేదిక‌ల మీద హ‌ల్ చ‌ల్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. గోనె కాల‌క్షేపం కోసం త‌ప్ప ఆయ‌న‌కు గోళ్లు గిల్లుకునే ప‌ని కూడా లేదంటూ  కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. అందుకే గోనె ఈ యూట్యూబ్ చానెళ్ల వేదిక‌గా పోరుపెడుతున్నారంటూ హేద్దేవా చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    DK Aruna : డీకే అరుణ దారెటు.. హస్తం వైపేనా..?

    DK Aruna : బీజేపీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి...

    Telangana EC’s key statement : తెలంగాణలో ఎన్నికలు.. నగదు తరలింపుపై ఈసీ కీలక ప్రకటన

    Telangana EC's key statement : తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్...