29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Karnataka Result : ఫలితాల వేళ ప్రియాంక ఎక్కడ?

    Date:

    • ఆరా తీస్తున్న పార్టీ అభిమానులు
    Karnataka result
    Karnataka result, Priyanka-Gandhi

    Karnataka result : కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి కూడా కాంగ్రెస్సే ముందంజలో కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్నది. మరోవైపు ఢిల్లీలో ని ఏఐసీసీసీ కార్యాలయం వద్ద ఇప్పటికే సంబురాలు మొదలయ్యాయి. పార్టీ గెలుపు ఖాయమని భావిస్తున్నాయి. కర్ణాటకలో కీలక నేత సిద్ధరామయ్య ఇంటి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మల్యే అభ్యర్థులను బెంగళూరుకు రావాలని అధిష్ఠానం ఆదేశించింది. అయితే ఈ ఆనంద సమయంలో పార్టీ కీలక నేత, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఎక్కడున్నారనే చర్చ కొనసాగుతున్నది.

    కర్ణాటకలో ప్రియాంక విస్తృత ప్రచారం..
    కర్ణాటక అసెంబ్లీ (Karnataka result ) ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా శ్రమించారు. పలు ప్రాంతాల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లారు. అయితే పార్టీ అత్యధిక సీట్లు గెల్చుకుంటున్నదనే ట్రెండింగ్స్ కొనసాగుతున్నాయి,. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎక్కడున్నారనే చర్చ కొనసాగుతున్నది. ఆమె ప్రస్తుతం హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో ఉన్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ గెలవాలని అక్కడి హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను కాంగ్రెస్ శ్రేణులు విడుదల చేశాయి. ఆమె గుడిలో ఉన్న వీడియోను చూపిస్తూ ఇక గెలుపు తమదేనంటూ చెబుతున్నారు.

    అభ్యర్థులపై అధిష్ఠానం నజర్..

    కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుతం తమ అభ్యర్థులపై దృష్టి పెట్టింది. బీజేపీ ఆపరేషన్ లోటస్ కు తెరదిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావిస్తున్నది. అందుకే వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించింది. రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే బీజేపీ జేడీఎస్ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వస్తున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నది. జేడీఎస్ నేతలకు టచ్ లోకి వెళ్తున్నది. ఈ పనిని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  అయితే సాయంత్రానికల్లా ఎవరు ఎటు వైపు నిలుస్తారో తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Winning in Karnataka : కర్ణాటకలో గెలిచిన ఆనందమూ దక్కట్లే..!

    కాంగ్రెస్ శ్రేణుల మనోగతం winning in Karnataka ఫ కర్ణాటక అసెంబ్లీ...

    Cartoon BJP vs Hindu : ఆలోచింపజేస్తున్న కార్టూన్.. బీజేపీ వర్సెస్ హిందూ..

    Cartoon BJP vs Hindu : భారతీయ జనతా పార్టీ ఈ...

    The alternative : ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనా?

    కర్ణాటక ఫలితాలతో దేశవ్యాప్తంగా మారిన మూడ్ త్వరలోనే ఢిల్లీలో కీలక...

    Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్ దే..? మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి మరీ..

    Karnataka Congress : కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన...