Gopichand Bhimaa : మ్యాచో హీరో గోపీచంద్ కు హీరో అవకాశాలు కలిసి రావడం లేదేమో. ఆయన చేసిన చాలా వరకు సినిమాలు వరుస ఫ్లాప్ ఇమేజ్ దక్కించుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘రామబాణం’ ఆయనకు నిరాశనే నిలిచింది. రామబాణంకు ముందు వచ్చిన ‘పక్కా కమర్షియల్’ చెప్పుకోలేనంత ఆడలేదు. దీంతో ఆయన మరో సినిమాతో తనను తాను నిరుపించుకోబోతున్నాడు.
మ్యాచో హీరో ప్రస్తుతం కన్నడ దర్శకుడు ఏ హర్ష టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘భీమా’లో నటిస్తున్నాడు. న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ గోపీచంద్ న్యూ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో అయితే పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కోపం కనిపించింది. చేతిలో సంకెళ్లను గట్టిగా పట్టుకోవడంతో రక్తం కారుతోంది. అతని కళ్లల్లో ఇంటెన్సిటీ ఉంది. ఇది ఇప్పటికీ యాక్షన్ బ్లాక్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ ఫైట్ సీక్వెన్స్, ఓ పాట చిత్రీకరిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
ఈ మూవీపై గోపీచంద్ ఆశలు పెట్టకున్నారు. పోస్టర్, ఇప్పటి వరకు వస్తున్న టాక్ చూస్తుంటే దీంతో ఫ్లాప్ హీరో అన్న మరక తొలగిపోవచ్చని ఇండస్ట్రీలో పెద్దలు, గోపీచంద్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమాపై గోపీచంద్ కూడా కోటి ఆశలు పెట్టుకున్నారట. నిర్మాణ విలువల్లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.