36.5 C
India
Friday, April 10, 2026
More

    కొత్త బిల్డింగ్ క‌దా.. మోజు తీరే వ‌ర‌కైనా కేసీఆర్ స‌చివాల‌యానికి వస్తారా?

    Date:

    new-secretariat
    new-secretariat

    ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విప‌క్షాలు వ్యంగ్యంగా సెటైర్లు మొద‌లెట్టాయి. కొత్త స‌చివాల‌యం క‌ట్టినందున ఇప్ప‌టికైనా ఆయ‌న సెక్రెటెరియ‌ట్‌కు వ‌స్తారా..? అని ప్ర‌శ్నిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్‌, ఆపార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్,భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డైతే కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంట‌రిచ్చారు. నూత‌న స‌చివాల‌యాన్నిక‌ట్టుకున్నారు. ఆయ‌న ఇప్ప‌టికైనా ప్ర‌తీ రోజు స‌చివాయంలో అడుగుపెడ‌తారా..? అని ప్ర‌శ్నించారు. కొత్త క‌ట్టుకున్న సెక్ర‌టెరియ‌ట్‌కు వ‌చ్చి పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియ‌ర్ చేస్తార‌ని ఆశీస్తున్న‌ట్లు  ఆశాభావం వ్య‌క్తం చేశారు.

    బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కూడా సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండేది నాలుగైదు నెల‌లే కాలం కాబ‌ట్టి ఆయ‌న నూత‌న స‌చివాల‌యం క‌ట్టుకొని సంతోషప‌డ‌డంలో త‌ప్పులేద‌న్నారు. అయితే ఐదు నెల‌ల త‌ర్వాత మాత్రం ఆయ‌న‌కు స‌చివాల‌యంలో అడుగు పెట్టేందుకు చాన్సుండ‌ద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగోలా బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. అందువ‌ల్ల ఆయ‌న ఇప్ప‌టి నుంచే ఎక్క‌డో కూర్చుంటారో ఆలోచ‌న చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఆయ‌న‌కు ఆలోచ‌న రాక‌పోతే నేనే చెబుతాన‌న్నారు. ప‌వ‌ర్ కోల్పోయిన త‌ర్వాత కేసీఆర్ ఫాంహౌజ్‌లోనే త‌న టికాన‌ను పెట్టుకుంటే బాగుంటుంద‌ని హేద్దేవా చేశారు.

    ఇక సీఎం కేసీఆర్ రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ..ఈ తొమ్మిదేళ్ల పాల‌నా కాలంలో ఎప్పుడు కూడా పెద్ద‌గా స‌చివాల‌యానికి వెళ్లిన సంద‌ర్భాలు లేవు. ఎక్కువ టైం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన అనేక ఫైల్స్  పెండింగ్లోనే ఉండిపోయాయి. విప‌క్షాలు ఎన్నిసార్లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసినా..ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే అటు కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి వెంక‌ట‌ర్ రెడ్డి..ఇటు బీజేపీ త‌ర‌పున ఆపార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కొత్త సచివాలయం తర్వాత అంతకుమించి కేసీఆర్ మరో నిర్మాణం

    తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నిమ్స్...

    మోస్తరు వర్షానికి నూతన సచివాలయం కురుస్తోంది..!

    కొత్త సచివాలయం చిన్నపాటి వర్షానికే ఉరుస్తోంది. తెలంగాణ స‌ర్కార్ ఛాలెంజ్‌గా తీసుకొని...

    గుర్తింపు కోస‌మే కేసీఆర్ తాప‌త్రాయం..!

    నిజాం రాజులు ఎంత‌టి నిరంకుశులో తెలిసిందే. సుమారు 224 ఏళ్ల పాటు...

    కొత్త స‌చివాల‌యంపై కేసీఆర్ మార్క్..!

      కేసీఆర్ ఏ ప‌ని చేసిన త‌న మార్క్ చూపించుకునే ప్ర‌య‌త్నం...