ఏపీ ప్రజలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లతో పాటుగా ప్రారంభోత్సవాలు కూడా చేసారు. ఆ కార్యక్రమం అయ్యాక భారీ బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
ఏపీ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఏమూలన ఉన్నప్పటికీ తమ కలుపుగోలుతనంతో చొచ్చుకు పోతారని , దాంతో అన్ని రంగాల్లో కూడా తమదైన ముద్ర వేశారని కొనియాడారు. ఏపీ ప్రజలు స్వభావ రీత్యా ….. ఎక్కడైనా స్థిరపడగలరు. విద్యా , వైద్య , సాంకేతిక , వ్యాపార రంగాలలో తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోడీ పొగడ్తల వర్షం కురిపించారు. 10 వేల కోట్ల పనులను ప్రారంభించామని , భవిష్యత్ లో మరింతగా అభివృద్ధి కి ఇవి దోహదపడతాయన్నారు. అలాగే విశాఖపట్నం కు భారత్ లో విశిష్ట స్థానం ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుండి కూడా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందన్నారు.