
problems in sex : ఇటీవల కాలంలో షుగర్ కామన్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరిలో ఈ వ్యాధి కనిపిస్తోంది. దీంతో మధుమేహం బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిన్న వయసులోనే చక్కెర రావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వారికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
మధుమేహం రావడంతో శృంగారంపై ప్రభావం చూపుతోంది. లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీని వల్ల భవిష్యత్ లో కూడా సమస్యలు రానున్నాయి. అధిక కొలెస్ట్రాల్ కూడా గుండెపోటుకు దారి తీస్తుంది. ఈ రెండు సమస్యలు ఉంటే వారికి శృంగార జీవితం ఉండదు. శృంగారంలో పాల్గొనాలంటే అంగస్తంభన జరగాలి. అంగం స్తంభించాలంటే రక్తప్రసరణ సాఫీగా ఉండాలి.
డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి శృంగారంలో అంత శ్రద్ధ ఉండదు. కామనాడులు స్తంభించవు. ఫలితంగా వారి శృంగార జీవితం ముందుకు సాగదు. అలా వారి జీవితంలో ఈ రెండు సమస్యలు ఉంటే ఇక అంతే సంగతి. జీవితాంతం బాధపడాల్సిందే. కానీ మనం వాటిని అదుపులో ఉంచుకుంటే అది పెద్ద సమస్య ఏమీ కాదు. మనకు రోగాలు ఉండటం కామనే. కానీ వాటిని నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు.
షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే ఇబ్బందులు ఉండవు. లైంగిక సామర్థ్యం ఉంటేనే మనకు సంసార సుఖం కలుగుతుంది. అంతేకాని పెళ్లి చేసుకుని మనం సమస్యలతో బాధపడితే జీవిత భాగస్వామికి కూడా ఇబ్బందే. ఈ క్రమంలో మన జబ్బులను కంట్రోల్ లో ఉంచుకుని శృంగార వాంఛలను తీర్చుకునే సత్తా కలిగి ఉండాలని అందరు కోరుకోవడంలో తప్పు లేదు.