Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ‘బిగ్ బాస్’. ఇక సీజన్ సీజన్ కు అందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో హీరో, హీరోయిన్లను మరిచిపోతామేమో గానీ వీరిని మరిచిపోవడం జరగదని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొన్ని వారాల వారి గురించే ట్రోల్స్, రీల్స్, ట్రైలర్స్, టీజర్స్ ఇలా సీజన్ అయిపోయేంత వరకు కనిపిస్తూనే ఉంటారు.
అలా బిగ్ బాస్ షోలో ఓ అమ్మాయి వాసంతి కృష్ణన్ గురించి తెలిసే ఉంటుంది. సీజన్ 6 కంటెస్టెంట్ గా వచ్చి బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ముద్దుగుమ్మ తన లవర్ పవన్ కల్యాణ్ ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఈమె మరో చోట కనిపించింది. ఇదేంటని.. అక్కడున్న జర్నలిస్ట్ లు అడిగితే.. మొగుడితో హనీమూన్ కంటే తన పక్కునున్న అతడిని చూపించి ప్రియుడితో రొమాన్స్ ముఖ్యం అంటూ చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.
వాసంతి కృష్ణన్ డిసెంబర్ లో తను ప్రేమించిన వాడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఫిబ్రవరిలో మూడు ముళ్లు వేయించుకుంది. వివాహం జరిగిన తర్వాత భర్తతో గడపాల్సిన ఈమె.. మరో వ్యక్తితో కనిపించింది. అతడితో కలిసి రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులు వేస్తోంది కూడా. ‘నీతోనే డ్యాన్స్ 2.O’షోలో పాల్గొన్న ఈమె బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రన్స్ యావర్ తో స్టెప్పులు వేసింది. అదిరిపోయే పాటకు అందంగా డ్యాన్స్ వేసింది.
దీంతో అదే షోకు యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి ఇదేంటి నువ్వు నీ భర్తతో హనీమూలో కదా ఉండాలి.. మరి ఇక్కడేంటి? అని అడిగింది. దీంతో వాసంతి కృష్ణన్ ‘నాకు హనీమూన్ కంటే ఇదే ముఖ్యం’ అంటూ చెప్పింది. అసలు ఆమె చెప్పింది డాన్స్ షో గురించి.. అయితే అందరూ యావర్ తో రొమాన్సే ముఖ్యం అంటూ రాసుకున్నారు. దీనికి తోడు నెటిజన్లు కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. వాసంతి తన భర్తతో కలిసి వచ్చి షోలో డ్యాన్స్ చేస్తే బాగుండేదని కొంత మంది అనగా.. అసలు యావర్ తో జోడీ ఏంటని? మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.
ప్రిన్స్ యావర్ నయని పావనితో కలిసి రావాలి నీతో రావడం ఏంటి? నువ్వు కూడా భర్తతో రాకుండా అతడితో ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొంత మంది అయితే ‘డాన్స్ చాలా బాగా చేశారు. మీ ఇద్దరి గ్రేస్ అదుర్స్’ అంటూ తమ కామెంట్ల రూపంలో అభిప్రాయాలు చెప్తున్నారు.