కరోనా వ్యాక్సిన్ తో లైంగిక సామర్ధ్యం తగ్గుతోందని నివేదికలు రావడంతో ఆందోళన రేకెత్తాయి. కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లలో అలాగే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో కూడా లైంగిక సామర్ధ్యం తగ్గుతోందని పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో అప్రమత్తమైన సైంటిస్టులు పరిశోధన చేయగా అదంతా ఉట్టి ప్రచారమే అని తేలింది. ఇలా ప్రచారం సాగడానికి కారణం చైనా ఇచ్చిన నివేదికలే అని తేల్చారు భారత్ సైంటిస్టులు.
కరోనా బారినపడిన వాళ్ళు అలాగే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మగవాళ్లలో లైంగిక సామర్ధ్యం తగ్గడంతో పాటుగా సంతానోత్పత్తికి అవసరమయ్యే వీర్యకణాలు పెద్ద సంఖ్యలో తగ్గిపోతున్నట్లుగా పుకార్లు సృష్టించింది చైనా. దాంతో అమెరికాకు చెందిన మియామి యూనివర్సిటీ ఈ రెండింటిపైనా పరిశోధనలు చేసి తప్పని నిరూపించింది. 18 – 45 సంవత్సరాల వయసున్న దాదాపు 50 మందిపై ఈ పరిశోధనలు చేసింది మియామి యూనివర్సిటీ. ఫైజర్ , మోడెర్నా టీకాలు తీసుకున్న వాళ్ళపై ప్రయోగాలు చేయగా అది తప్పని తేలింది. లైంగిక సామర్ధ్యంతో పాటుగా వీర్య కణాల పై కూడా పరిశోధనలు చేసాయి. ఇదంతా చైనా సంస్థలు సృష్టించిన గ్లోబల్ ప్రచారంగా తేల్చాయి.