సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీ వెళ్ళాడు. రజనీకాంత్ కు ఢిల్లీలో పని ఏంటి ? అని అనుకుంటున్నారా ? రాజకీయాల కోసం కాదు సుమా ! సినిమా కోసమే !! తాజాగా రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ” జైలర్ ” . నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చెన్నై , హైదరాబాద్ , ఢిల్లీ లలో షూటింగ్ జరుపుకోనుంది. అందులో భాగంగానే ఢిల్లీలో 10 రోజుల పాటు ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారట. దాంతో 10 రోజుల పాటు ఢిల్లీలో షూటింగ్ జరుపుకోనుంది జైలర్ చిత్రం.
ఇక ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వచ్చారు. దాంతో చంద్రబాబుని కలిసాడు రజనీకాంత్. ఇరువురి మధ్య కొంతసేపు చర్చలు జరిగాయి. చంద్రబాబు – రజనీకాంత్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడం విశేషం. ఆగస్టు సంక్షోభంలో రజనీకాంత్ చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఢిల్లీ లో షూటింగ్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ లో షూటింగ్ జరుగనుంది. రజనీకాంత్ జైలర్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ , ఐశ్వర్యరాయ్ , ప్రియాంక మోహన్ , రమ్యకృష్ణ , యోగిబాబు ,తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జైలర్ సినిమా కోసం సెట్టింగ్స్ వేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగనుంది.