32.2 C
India
Monday, April 29, 2024
More

    Chandrababu : చాణక్యంలో చంద్రబాబును మించినోళ్లు లేరు..!

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు సీఎంగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని కొన్ని కారణాల వల్ల తన చేతిలోకి తెచ్చుకుని ఆ పార్టీని ఇప్పటికీ అదే ఉత్సాహంతో నడుపుతున్న తీరు మెచ్చుకోదగ్గదే. నాలుగు దశాబ్దాలు దాటుతున్నా రాష్ట్రంలో ప్రధాన పార్టీగా టీడీపీ వెలుగొందుతుందంటే అది చంద్రబాబు చలువే. 2019 ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పటికీ మరి కొద్ది రోజుల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఫుల్ జోష్ తో సిద్ధమైంది.

    2024 అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ అత్యంత కీలకమైనవి. అలాగే జనసేన, బీజేపీ, వైసీపీలకు కూడా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అధికారం రాకుంటే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని మాత్రం సంకోచం లేకుండా చెప్పవచ్చు. ఇవన్నీ తెలిసే ఆయన చాలా వ్యూహత్మకంగా పావులు కదిపారు. జగన్ రెడ్డిని ఓడించాలంటే ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతిమంగా వైసీపీకే మేలు జరుగుతుందని అంచనా వేశారు. గతంలో చేసిన తప్పును ఇప్పుడు చేయకూడదంటే కచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సిందే. అందుకే జనసేన, బీజేపీతో సుదీర్ఘంగా చర్చించి పొత్తులు పెట్టుకున్నారు.

    ఈక్రమంలో జనసేన, బీజేపీలకు తక్కువ సీట్లు ఇవ్వడం, అలాగే తాము బలంగా లేని చోట వారికి సీట్లు ఇవ్వడం అనేది చంద్రబాబు వ్యూహమనే చెప్పాలి. అయితే ఈ మూడు పార్టీల్లో పెద్ద పార్టీ టీడీపీనే.. కాబట్టి ఆ పార్టీకి కచ్చితంగా మొగ్గు ఉండాల్సిందే. అలాగే టీడీపీకి మాత్రమే మిగతా రెండు పార్టీలతో పోలిస్తే ప్రతీగ్రామంలో బలమైన క్యాడర్ ఉంది. అందుకే ఆ పార్టీలు టీడీపీని అనుసరించాల్సిందే.

    ఇక జగన్ ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం కచ్చితంగా అవసరం. గతంలో బీజేపీ కేంద్ర పెద్దలతో చంద్రబాబు విభేదాలు ఉన్నప్పటికీ..జగన్ ను ఓడించడానికి వాటిని పక్కకు ముందుకు నడిచారు చంద్రబాబు. దీంతో మోదీ, అమిత్ షా కూడా చంద్రబాబుతో పొత్తుకు అంగీకరించారు. చంద్రబాబు చాణక్యం ద్వారా రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలకు మేలు జరిగే అవకాశం ఉండబోతోంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...