24.1 C
India
Tuesday, October 3, 2023
More

    విశాఖ, అనంతపురంలో లాజిస్టిక్ పార్కులు

    Date:

    Logistic parks in Visakhapatnam and Anantapur
    Logistic parks in Visakhapatnam and Anantapur

    న్యూఢిల్లీ, డిసెంబర్ 23: విశాఖపట్నం, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోం ప్రకాష్ వెల్లడించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వివిధ రాష్ట్రాల్లో మొత్తం 35 ప్రదేశాలను గుర్తించి మల్టీ మెడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తోందని వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. నేషనల్ లాజిస్టిక్ పాలసీని కేంద్ర కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు.

    దేశంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ సమర్ధత పెంచి వ్యయాన్ని తగ్గించడం నేషనల్ లాజిస్టిక్ పాలసీ ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. పూర్తిస్థాయి లాజిస్టిక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించడం ఎన్ ఎల్ పీ-2022 సమగ్ర ఎజెండా అని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం సమర్థవంతమైన లాజిస్టిక్ సెక్టార్ అవసరమని అన్నారు. మొత్తం జీడీపీలో లాజిస్టిక్ సెక్టార్ వాటాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం లేనప్పటికీ రైల్వే, రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలు ఇతర లాజిస్టిక్ సెక్టార్ల జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 2018-19లో 1,71,75,128 కోట్లు, 2019-20 లో 1,83,55,109 కోట్లు, 2020-21లో 1,80,57,810 కోట్లు ఉందని మంత్రి పేర్కొన్నారు

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YV vs Vijayasai : వైవీ వర్సెస్ విజయసాయి.. మరోసారి వైసీపీలో వార్

    YV vs Vijayasai : వైసీపీలో ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు...

    AP CM Jagan : ఏపీ సీఎం లోకేషన్ చేంజ్..ఇక అక్కడే మకాం..!

    AP CM Jagan : విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌డానికి ముహూర్తం ఫిక్స్...

    Taj Mahal in AP : ఏపీలో కూడా ఓ తాజ్ మహల్ ఉంది తెలుసా?

    Taj Mahal in AP : ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని...