ఇటీవల మరణించిన సీనియర్ నటులు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ముగిశాయి. మహా ప్రస్తానంలోని దహన వాటికలో చలపతిరావు పార్దీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చలపతిరావు కు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కాగా ఇద్దరు కూతుర్లు కూడా అమెరికాలో ఉండటంతో వాళ్ళు వచ్చేవరకు మహా ప్రస్థానంలో ఉంచారు. ఇక వాళ్ళు మొన్ననే వచ్చారు కానీ మంగళవారం రోజున అంత్యక్రియలు నిర్వహించరు కాబట్టి బుధవారం రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు.