
నటసింహం నందమూరి బాలకృష్ణ సీనియర్ నటుడు చలపతిరావుకు నివాళులు అర్పించాడు. ఈరోజు ఫిలిం నగర్ లో చలపతిరావు పెద్ద కర్మ జరిగింది. ఆ కర్మకాండకు బాలయ్య వెళ్ళాడు. చలపతిరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు. ఇటీవల గుండెపోటుతో చలపతిరావు మరణించిన సంగతి తెలిసిందే.
అయితే చలపతి రావు మరణించిన సమయంలో బాలయ్య సినిమా షూటింగ్ తో ఆహా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. దాంతో చలపతిరావు కుటుంబాన్ని పరామర్శించలేకపోయాడు. దాంతో ఈరోజు జరిగిన పెద్దకర్మ కు హాజరై చలపతిరావు కుటుంబాన్ని పరామర్శించాడు.
చలపతిరావు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. దాంతో బాలయ్యకు కూడా సన్నిహితుడయ్యాడు. నిత్యం ఎన్టీఆర్ జపం చేస్తుండేవాడు చలపతిరావు. అన్నగారి మనిషిగా ముద్రపడ్డాడు. ఇక చలపతిరావు ఎదుగుదలలో ఎన్టీఆర్ ప్రోత్సాహం , సహకారం ఎంతో ఉంది. 1200 కు పైగా చిత్రాల్లో చలపతిరావు నటించిన విషయం తెలిసిందే. విలన్ గా ఎక్కువగా ప్రాచుర్యం పొందాడు. అలాగే పలు చిత్రాలను నిర్మించాడు కూడా.