delhi High Court restrains illegal streaming balakrishna’s unstoppable showనటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ” అన్ స్టాపబుల్ 2 విత్ NBK ”. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేసారు. అయితే ఈ అన్ స్టాపబుల్ షో ను పలు వెబ్ సైట్ లు కాపీ చేసి బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే ఇన్నాళ్లు ఈ విషయం పట్ల చూసి చూడనట్లుగా ఉన్నారు.
కానీ ఇప్పుడు బాహుబలి ప్రభాస్ తో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇంటర్వ్యూలు చేసారు. వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మా అన్ స్టాపబుల్ షోను ఎవరు కూడా పైరసీ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఆహా సంస్థ. దాంతో ఎవరు కూడా పైరసీ చేయకుండా , ఒకవేళ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ నిన్న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయగా వెంటనే పెద్ద ఎత్తున స్పందన లభించింది. దాంతో ఆహా సర్వర్ క్రాష్ అయ్యింది. కేవలం 12 గంటల్లోనే 50 మిలియన్ మినిట్స్ వ్యూస్ తో సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఇదే జోరుతో ఓటీటీ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.