sitara టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫాలోయింగ్ ఎక్కువే. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు మహేష్ బాబు, నమ్రత, అన్నయ్య గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుతో పాటు సితారకు కూడా ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. 11వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సితారకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్వు ఎదగడానికి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని ట్వీట్ లో మహేష్ బాబు వెల్లడించాడు.
హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో సితార కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురుగా గుర్తింపు తెచ్చుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. సర్కారు వారి పాట ఆల్బమ్ ఫెన్సీ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. సితార తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేస్తుందని అందరు అనుకుంటున్నారు.
అనుకున్న దానికంటే ముందే సితార హీరోయిన్ గా వస్తుందని అంచనా వేస్తున్నారు. చిత్రసీమలో నటిగా ప్రవేశించి తన సత్తా చాటాలని చూస్తోందట. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు సితార భావోద్వేగానికి లోనైంది. తండ్రి బాటలో బ్రాండ్ అంబాసిడర్ గా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. మహేష్ బాబు కూతురు ప్రీమియం జ్యువెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
చిన్న వయసులోనే జువెల్లరీ కాంటాక్ట్ కు సంతకం చేసి రూ. కోటి పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్యపరచింది. పీఎంజే జువెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీనికి గాను భారీ రెమ్యూనరేషన్ అందుకుంది. దీంతో అప్పుడే తండ్రిని మించిన కూతురు అని ప్రశంసించారు. భవిష్యత్ లో ఇంకా ఎన్ని చిత్రాలు చేస్తుందో అని అందరు ఆశ్చర్యపోతున్నారు.