పిల్లలకు సంబంధించిన ఫొటోలు తల్లి నమ్రతా శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటుంది. దీంతో వారు కూడా స్పందిస్తుంటారు. తండ్రికి తగ్గ తనయ అంటూ ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రెస్టీజియస్ న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ లో ప్రదర్శించారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సితార డాన్సు కూడా చేస్తుంది. భరత నాట్యం చేస్తుంది. వాటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీంతో ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. తండ్రి మాదిరే పెద్దయ్యాక హీరోయిన్ గా చేస్తుందేమో అంటుంటారు. నటన వారి రక్తంలోనే ఉందని చెబుతున్నారు. ఇలా సితార మరో వండర్ క్రియేట్ చేస్తోంది. ఓ జువెల్లరీ సంస్థకు యాడ్ చేయడంతో అందరు కితాబిస్తున్నారు.
మహేశ్ బాబు కూడా సమయం దొరికినప్పుడు పిల్లలతో గడుపుతుంటాడు. వారిని వెకేషన్స్ కు తీసుకెళ్తుంటాడు. తల్లిదండ్రుల ఫోకస్ పిల్లల మీద ఉంటే వారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తుంటారు. దీనికి సితార ఓ ఉదాహరణ. తండ్రి సూచనల మేరకే సితార ఇలా నటన వైపు దృష్టి సారిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. కూతురు చేసిన దానికి తండ్రి కూడా మురిసిపోతున్నాడు.
ReplyForward
|