Pooja Hegde బుట్టబొమ్మ పూజా హెగ్డే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి కనెక్షన్ ఉంది. ఇద్దరి కాంబినేషన్ లో బిగ్ హిట్స్ వచ్చాయి. ఒకటి ‘అరవింద సమేత వీర రాఘవ’, రెండు ‘అల వైకుంఠపురములో’ ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రం ‘గుంటూరు కారం’లో మాత్రం పూజా హెగ్డేను తీసుకోలేదు. మొదట్లో తీసుకున్నా. కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించారు. అయినా ఆమెను చూపించాలనుకున్న మాటల మాంత్రికుడు పూజా కోసం ఒక ఐటం సాంగ్ ను సిద్ధం చేశారంటూ సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలిసింది. ఇది పక్కన ఉంచితే త్రివిక్రమ్ పూజా కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత తలరాత పూర్తిగా మారిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విరూపాక్ష నుంచి మొదలు కొని దాదాపు బ్రో కూడా హిట్ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ తో త్రివిక్రమ్ ఒక సినిమాను తీస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడిగా పని చేస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట.
‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. అందం, అభినయంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. 2014లో వచ్చిన ‘ముకుందా’లో మెగా ప్రిన్స్వరుణ్ తేజ్తో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఆఫర్ల వరద ఏరులుగా పారింది. ఒక సినిమా తర్వాత మరో సినిమా ఇలా వెంట వెంటనే చేస్తూ స్టార్ హీరోయిన్ గా పాతుకుపోయింది. ఆమె సినిమాలు అల వైకుంఠపురములో, దువ్వాడ జగన్నాథం,గద్ధలకొండ గణేశ్, మహర్షి అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినవే.