31.4 C
India
Monday, May 20, 2024
More

    60 ఏళ్ల ఆచారాన్ని పాతరపెట్టిన ఆస్కార్

    Date:

    60 year old tradition red carpet color change in oscar
    60 year old tradition red carpet color change in oscar

    60 ఏళ్ల ఆచారాన్ని పాతర పెట్టింది ఆస్కార్. గత 60 ఏళ్లుగా రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ ఉండేది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై గర్వంగా అడుగులు వేయాలని తహతహలాడేవాళ్లు నటీనటులు , సాంకేతిక నిపుణులు. అయితే ఇన్నాళ్ళుగా సాగుతున్న రెడ్ కార్పెట్ ఆచారాన్ని ఈసారి మాత్రం పాతరపెట్టింది ఆస్కార్. రెడ్ కార్పెట్ కు బదులుగా షాంపైన్ కలర్ కార్పెట్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఇలా ఎందుకు చేసారో ఎవరికీ అర్ధం కావడం లేదు.

    దాంతో ఆస్కార్ రెడ్ కార్పెట్ అంశం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రెడ్ కార్పెట్ బదులుగా షాంపైన్ కలర్ ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆస్కార్ నిర్వాహకులు వివరణ ఇవ్వలేదు. అయితే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కిమ్మెల్ స్పందించాడు.

    గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్య సంఘటన జరిగిన విషయం తెలిసిందే. విల్ స్మిత్ క్రిస్ రాక్ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. బహుశా ఆ సంఘటనతో ఆస్కార్ వేడుక మరింతగా ఎరుపెక్కిందని భావించారేమో అందుకే ఈసారి రెడ్ కార్పెట్ కు బదులుగా షాంపైన్ కలర్ ను కార్పెట్ గా మలిచారని వ్యాఖ్యానించాడు. అయితే ఆస్కార్ నిర్వాహకులు మాత్రం రెడ్ కార్పెట్ స్థానంలో షాంపైన్ కలర్ ను ఎందుకు ప్రిఫర్ చేసారని వెల్లడించలేదు దాంతో స్పెక్యులేషన్స్ పెరిగిపోయాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కాలభైరవ ట్వీట్ పై ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ ఫైర్

    నాటు నాటు పాట ఆస్కార్ వేదిక మీద పాడే అవకాశం రావడానికి...

    ఢిల్లీలో చరణ్ కు ఘన స్వాగతం

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది....

    రెండుసార్లు ఆస్కార్ అందుకున్న భారతీయ మహిళ ఎవరో తెలుసా ?

    భారతదేశానికి ఆస్కార్ దక్కలేదు ...... ఆర్ ఆర్ ఆర్ వల్లే ఆస్కార్...

    ఎన్టీఆర్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్

    తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంతో...