
తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంతో చాలా సంతోషంగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆస్కార్ అవార్డు అనేది తెలుగు సినిమా ఊహించడమే కష్టం అనుకుంటున్న సందర్భం నుండి ఆస్కార్ సాధించే వరకు తెలుగు సినిమా ప్రయాణంలో తాను ఉన్నందుకు గర్వపడుతున్నాడు ఎన్టీఆర్. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ సినిమా ఈనెల 23 న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.
ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ తో తలపడనున్నాడు. ఎన్టీఆర్ 30 కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి నిర్మించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.