33.7 C
India
Tuesday, May 14, 2024
More

    వివేకా హత్య కేసు విచారణ గడువు పెంపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    Date:

    Supreme court fires on cbi on vivekananda reddy murder case issue
    Supreme court

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణ గడువును పొడిగించింది .ఏప్రిల్  నెలాఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. తాజాగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ కోసం జూన్ 20 వరకు గడువు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది.

    ముందుగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇద్దరినీ ఒకేసారి విచారించాలని సీబీఐ భావించింది.. అయితే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డి కి నోటీసులు ఇచ్చే లోపే అవినాష్ రెడ్డి  తనను అరెస్ట్  చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు..

    ఇక ముందస్తు బెయిల్ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసి ఉండేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయనంతో ఉందని పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Gaza : గాజాలో ఐరాస వాహనంపై దాడి.. భారతీయుడి మృతి

    Gaza : గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి...

    Theatre-OTT : థియేటర్.. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయా?

    Theatre-OTT : ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని...