38.1 C
India
Sunday, May 19, 2024
More

    Alcohol : రోజు పెగ్గు తాగినా? ఆ వ్యాధులు రావడం ఖాయమట

    Date:

    Alcohol
    Alcohol

    Alcohol :

    ఏముందిలే రోజుకు ఒక పెగ్గుతో ఏమవుతుంది అనుకునే వారు ఎక్కువగా ఉంటారు. పైగా వీరి తాగుబోతు కథలకు సాక్షాత్తు వైద్యులే తాగమంటున్నారు అంటూ సాకు కూడా చెప్తారు. పాపం నెపం వారిపై నెట్టేసి రోజుకు పెగ్గు చొప్పున తాగడం మొదలు పెడతారు. అయితే మద్యం ఏదైనా ఎంత తీసుకున్నా నష్టమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కాదు వారానికి ఒకసారి కూడా తాగడం మంచిది కాదు అని చెప్తున్నారు. ఈ న్యూస్ నిజంగా మందు బాబులకు కిక్కు దిగిపోయేదే. మీరు ఏ మేరకు ఎంత తాగినా ఫలితం మాత్రం అదే అంటూ హెచ్చరిస్తున్నారు.

    మద్యం అన్ని రకాలుగా మనిషిని డ్యామేజ్ చేస్తుంది. ఇటు సోషల్ గా.. అటు ఎకనామికల్ గా.. ఫ్యామిలీ పరంగా కూడా మద్యపానం మంచిదికాదు. సమాజం తాగుబోతుగా చూడడంతో పాటు కనీస విలువ కూడా ఇవ్వదు. ఇక తాగుబోతులు పనిపై శ్రద్ధ పెట్టక తాగుడుకు డబ్బులు దొరకక ఎకనామికల్ గా తీవ్రంగా నష్టపోతారు. ఇక ఫ్యామిలీకి సరైన సమయం కూడా ఇవ్వకపోవడంతో అందరిలో ఉన్నా ఎవ్వరూ పలకరించక ఒంటరై పోతారు. ఇలా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మధ్యం అందుకే మద్యంకు దూరంగా ఉండాలని పెద్దల నుంచి వైద్యుల వరకు అందరూ సూచిస్తుంటారు.

    ఇక, ఇటీవల దీనిపై ఒక అద్యయనం చేశారు శాస్త్రవేత్తలు. రోజుకు పెగ్గు మాత్రం తాగే వారిలో ఆరోగ్య లక్షణాలను పరిశీలించారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లోని 19వేల మందిపై చేసిన అధ్యయనంలో చాలా విషయాలు బయట పడ్డాయి. మితంగా తాగినా (అంటే రోజుకు పెగ్గు చొప్పున) హైబీపీ లేదా లోబీపీ, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయని గుర్తించారు. అయితే ఇందులో ప్రత్యేకమైన ప్రయోజనాలు మాత్రం ఏమీ కనిపించలేదన్నారు. మందు బాబులు జర జాగ్రత్త పెగ్గు పెగ్గు అంటే మాత్రం రోగాలే గతి అంటూ హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్...

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.....