38.1 C
India
Sunday, May 19, 2024
More

    Bhagwant Kesari : భగవంత్ కేసరిపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్.. తేరుకున్న బాలయ్య బాబు ఫ్యాన్స్

    Date:

    Bhagwant Kesari
    Bhagwant Kesari

    Bhagwant Kesari :  బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ గతంలో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీగా రూమర్స్ వస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక సినిమాకు రిమేక్ గా వస్తుందని రూమార్లు మొదలయ్యాయి.

    గతంలో బాలకృష్ణ అన్న హరికృష్ణ చేసిన సినిమా ‘స్వామి’ మూవీకి ఈ సినిమా మరో రిమేక్ అన్న న్యూస్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ హైరానా పడింది. అసలు ఈ రూమర్ ఎలా స్ప్రెడ్ అయ్యిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఇది రిమేక్ కాదని.. స్వామి సినిమాలోని చిన్న లైన్ కూడా ఇందులో లేదని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ కొంచెం తేరుకున్నారు.

    టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ లు వరుస ఫ్లాపులకు గురవుతున్నాయి. తమిళంలో భారీ విజయం సాధించిన ‘వినోదయం సీతం’ను తెలుగులో ‘బ్రో’గా రిలీజ్ చేయగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే తమిళంలోని ‘వేదాళం’ సినిమాను చిరంజీవితో ‘భోళా శంకర్’గా తీయగా అది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి రీమేక్ అనడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ గుండెల్లో రైల్లు పరుగెత్తాయి. యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో కుదుట పడ్డారు.

    ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది భగవంత్ కేసరిని నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా కాజల్ నటిస్తుండగా.. హీరో కూతురు వరుస అయ్యే పాత్రలో శ్రీలీల కనిపించనుందట. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇందులో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు రాంపాల్. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ వేగంగా పని చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...

    Basavatarakam Hospital : బాలయ్య సేవలు మెచ్చి బసవతారకం ఆస్పత్రికి ఎన్ఆర్ఐ పొట్లూరి రవి చేసిన సాయమిదీ

    Basavatarakam Hospital : మాట్లాడే మాటలకన్నా.. చేసే సాయం మిన్నా అంటారు....