26.3 C
India
Thursday, July 4, 2024
More

    AP Assembly : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ.. నేడు మంత్రివర్గ భేటీ.. కీలక అంశాలపై చర్చ

    Date:

    AP Assembly
    AP Assembly

    AP Assembly : ఏపీలో గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జరుగుతున్న ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కేంద్రంలోనూ మారుతున్న పరిణామాల దృష్ట్యా ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ఇక ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కూడా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తున్నది.

    ఏపీ మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సవరించిన నిర్ణయాలకు ఆమోదం తెలుపనున్నారు.  దీంతో పాటు జీపీఎస్ అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తున్నది. దీంతో పాటు పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశమున్నది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తున్నది. కేంద్రం తీసుకొచ్చే ఇతర బిల్లులపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలుస్తున్నది.

    కాగా రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా చర్చించే అవకాశమున్నది. చంద్రబాబుకు ఈ అవినీతిలో పాత్ర ఉందని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, చంద్రబాబు నేరం చేశారని చెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా అమలు చేయాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా చంద్రబాబు అరెస్ట్ అ నంతరం ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    Share post:

    More like this
    Related

    Kalki Movie Collections : కల్కి మూవీకి వారంలో 370 కోట్లు.. ఇంకా రావాల్సింది ఎంతంటే..?

    Kalki Movie Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు...

    Kavitha : కవితకు జైలు నుంచి విముక్తి దొరకదా..?

    Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు నెలల...

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    Mandhana-Shafali : సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన మంధాన-షఫాలీ.. దిగజారిన  దక్షిణాఫ్రికా  పరిస్థితి 

    Mandhana-Shafali : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP Another Mistake : వైసీపీ మరో తప్పు చేస్తుందా.. ఆ ప్రజల తరుఫున ఎవరు పోరాడాలి?

    YCP Another Mistake : రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వ సాధారణం....

    Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు

    Ayyannapatrudu : ఏపీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    YS Jagan : వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి వచ్చిన జగన్

    YS Jagan : అసెంబ్లీలోకి వెనుక గేటు నుంచి వచ్చిన వైసీపీ...