38.1 C
India
Sunday, May 19, 2024
More

    Sankranti Release 2024 : సంక్రాంతి విడుదలకే అందరి పట్టు.. రాయబారాల్లో సినీ పెద్దలు!

    Date:

    Sankranti Release 2024
    Sankranti Release 2024

    Sankranti Release 2024 : తెలుగింటి పండుగ సంక్రాంతి. ఏపీలో సంక్రాంతే పెద్ద పండుగ. జనాలు ఈ పండుగను ఎంతగా గొప్పగా చేసుకుంటారో ఆంధ్రా పల్లెల్లోకి వెళ్లి చూస్తేనే అర్థమవుతుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో హడావిడే. చుట్టాలతో కళకళలాడుతుంటాయి. అలాగే ఆటలు, పాటలు, జాతరలు, కోళ్లపందేలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో సంబరాలు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చిందంటే బొమ్మ అదిరినట్టేనని నిర్మాతలు భావిస్తారు. సంక్రాంతి అంటే అంతగా సెంటిమెంట్ తో ఉంటారు. కచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ చేయాలని హీరోలు, దర్శకులు పట్టుబట్టుతుంటారు. సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు వచ్చినా వాటిని చూసి ఏపీ జనాలు ఆదరిస్తారు. అందుకే సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి సంవత్సరం ముందే ఫిక్స్ అయిపోతుంటారు మేకర్స్. ఇప్పుడదే పోటీ జరుగుతోంది.

    ఇప్పుడీ సంక్రాంతి సినిమాల పంచాయితీపై టాలీవుడ్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఇంకా కొలిక్కి రాలేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. జనవరి 12న గుంటూరు కారం ఉంది కాబట్టి.. ఒకరోజు ముందుగా హనుమాన్ వస్తే బాగుంటుందని పెద్దలు ప్రతిపాదించారు. అయితే వారు ఒప్పుకోలేదట. అలాగే ఎవరైనా జనవరి 1తేదీన వస్తే కనీసం పదిరోజుల ఓపెన్ గ్రౌండ్ దొరకుతుంది అని కూడా సూచించారట. అయినా దీనికి కూడా ఒప్పుకోవడం లేదట.

    ఈ రాయబార చర్చల్లో దిల్ రాజు, నాగవంశీ, సురేశ్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్, 13న ఈగల్- సైంధవ్, 14న నా సామిరంగ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. వీటితో పాటు తమిళ సినిమాలు ఉన్నాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలన్’ ఉన్నాయి. అనువాద చిత్రాల సంగతి అటుంచితే.. ఇక మన తెలుగు హీరోలు, నిర్మాతలు ఎవరూ తమ డేట్లను కదిలించడానికి ఇష్టపడడం లేదట.

    మహేశ్ బాబు, వెంకటేశ్, నాగార్జున, రవితేజ.. ఇలా పెద్ద హీరోలందరితో పాటు మోస్ట్ ఎవైటెడ్ మూవీ హనుమాన్ కూడా పోటీలో ఉండడంతో ఈ సినిమాలపై ఎంతో బజ్ నెలకొనిఉంది. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను ఈ సినిమాలకు మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంది. మహేశ్ బాబు రేంజ్ కు ఏ చిన్న సెంటర్ లోనైనా రెండు థియేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అన్నీ సినిమాలు ఒకే సారి వస్తుండడంతో ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు.

    సినిమా డేట్లపై ఈ రెండు, మూడు రోజుల్లో తేల్చేయాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లు తేలితేనే వారు సినిమా ప్రమోషన్లు గట్రా చేసుకోవాల్సి ఉంటంది. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Mahesh Babu Sankranti Movies : సంక్రాంతి రేసులో మహేశ్ ఎన్నిసార్లు ఉన్నాడో తెలుసా?

    Mahesh Babu Sankranti Movies : పండుగల్లో ప్రత్యేకమైనది సంక్రాంతి. ఈ...