26.1 C
India
Saturday, June 22, 2024
More

    Getup Srinu : గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ ను రిపీట్ చేయగలడా?

    Date:

    Getup Srinu
    Getup Srinu-Sudligali Sudheer

    Getup Srinu : కమేడియన్లు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా మారి టాలీవుడ్ లో ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ఇలా తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ టీవీ షోతో ఫేమస్ అయి సినిమాల్లో రాణించిన వారు కూడా ఉన్నారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. ఇప్పుడు మరో నటుడు మేయిన్ స్ట్రీమ్ యాక్టర్ గా మారబోతున్నాడు. అతనే ‘గెటప్ శ్రీను’. ‘రాజు యాదవ్’ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

    కామెడీ, సస్పెన్స్, డ్రామా మేళవింపుతో తెరకెక్కిన ‘రాజు యాదవ్’. లైట్ హార్ట్ డ్రామాకు ఫ్రెష్ టేక్ ఇస్తుంది. గెటప్ శ్రీను ఇప్పటికే పాపులర్ కావడంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో చూడాలి.

    ఈ సినిమాలో రాజు యాదవ్ పాత్రలో గెటప్ శ్రీను కనిపిస్తాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో బాల్ తాకడం వల్ల అతని జీవితం సంక్లిష్టంగా మారుతుంది. బాల్ తాకడం వల్ల గెటప్ శ్రీను (రాజు యాదవ్) ఫేస్ పై చిరునవ్వు అలానే ఉండిపోతుంది. దీని వల్ల ఎప్పడూ చిరునవ్వుతోనే కనిపిస్తాడు. ఆపరేషన్ చేస్తే గానీ సరికాదు. ఇదే ఇతి వృత్తాన్ని స్పష్టంగా తెలిపే థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ఈ సినిమాతో గెటప్ శ్రీను హీరో పాత్రలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీను చాలా సినిమాల్లో సీనియర్ యాక్టర్స్ తో కలిసి నటించారు. ఇటీవల వచ్చిన హను-మన్ లో ఆయన పోషించిన పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతకు ముందే జబర్దస్త్ లో ఆయన చేసిన స్కిట్లు పాపులర్ కావడంతో పాటు మీమ్ కమ్యూనిటీలో ఆయన చేసిన స్కిట్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనకు పాపులారిటీ ఉన్నప్పటికీ దాన్ని బాక్సాఫీస్ వద్ద ఎలా వాడుకుంటాడో తెలియదు.

    సప్తగిరి, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లకు కూడా నిలదొక్కుకోవడానికి చాలా సినిమాలు, కాలం పట్టింది. కాబట్టి గెటప్ శ్రీను క్లీన్ కామెడీ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని, సరైన కథతో ఆయన సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. కాబట్టి ‘రాజు యాదవ్’ అలియాస్ ‘గెటప్ శ్రీను’కు ఇది పరీక్షా సమయం కాబోతోంది.

    Share post:

    More like this
    Related

    Trump Sensation : అమెరికాలో గ్రాడ్యూయేషన్ చేసిన వారికి గ్రీన్ కార్డ్.. ట్రంప్ సంచలనం

    Trump Sensation : యూఎస్ఏలోని కాలేజీలు, యూనివర్సిటీలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న...

    AP CEO : బాబు ఏపీ సీఎం కాదు.. సీఈవోనట..

    AP CEO : ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు నుంచి టెక్నాలజీపై...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    -  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jabardast comedian Hari : జబర్దస్త్ కమెడియన్ హరి స్మగ్లింగ్ కేసులో లేడట.. ఇది అబద్ధమని తేల్చేశారా?

    Jabardast comedian Hari : జబర్దస్త్ ఆర్టిస్టులు ఏదో ఒక కేసులో...