31.1 C
India
Wednesday, June 26, 2024
More

    OTT : మోస్ట్ వాంటెడ్ ఓటీటీ షోకు ఇంకా 24 గంటలే..

    Date:

    Panchayat Season 3
    Panchayat Season 3 in OTT

    OTT Series : ఓటీటీ ప్రపంచంలో అత్యద్భుతమైన సిరీస్ ‘పంచాయత్’. రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో మూడో సీజన్ గా మన ముందుకు రాబోతోంది. గడిచిన రెండు సీజన్లను చూసిన ప్రేక్షకులు సీజన్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ చందన్ కుమార్ రాసిన ‘పంచాయత్’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో సెక్రటరీగా నిరుద్యోగ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ అభిషేక్ త్రిపాఠి పాత్ర చూట్టూ కథ తిరుగుతుంది.

    ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అత్యంత ఉత్కంఠభరితమైన ఓటీటీ షోలలో ఒకటైన పంచాయితీ 3 మరికొద్ది గంటల్లో ఓటీటీ అరంగేట్రం చేయనుంది. ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. గ్రామీణ డ్రామా సిరీస్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుండడంతో ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

    అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన అతికొద్ది ఓటీటీ షోలలో పంచాయిత్ ఒకటి. టార్గెట్ హిందీ ఆడియన్స్ తో పాటు ఇతర భాషా ప్రేక్షకులకు కూడా ఈ షో బాగా వర్కవుట్ అయ్యింది. ఉత్తరాదిలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి డ్రామా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింపుల్ డ్రామా ఫ్యాక్టర్, ప్రధాన తారాగణం సహజ నటన ఈ షోకు ప్రధానాంశాలు.

    ఈ షోపై అంచనాలను పెంచుతూ అమెజాన్ ఈ షో ఓటీటీ అరంగేట్రంను కొంతకాలం వాయిదా వేస్తూ మళ్లీ హైప్ కార్డ్ ఆడింది. ఈ జాప్యం ఇప్పుడు షోపై అంచనాలను మరింత పెంచింది.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఈ 5 ఓటీటీ మూవీస్ అస్సలు ఒంటరిగా చూడకండి! భయంతో వణకడం ఖాయం..

    OTT Movies : ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...