24.1 C
India
Sunday, June 30, 2024
More

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    Date:

    YS Jagan
    YCP offices demolition

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ కార్యాలయాలను కూల్చి వేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చివేయగా జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వాటి పనులు నిలిపివేయాలని నోటీసులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని.. వారంలో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

    వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఎక్కడపడితే అక్కడ ప్యాలెస్‌ల తరహాలో కార్యాలయాలు నిర్మించారు. వాటిలో కొన్ని పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇవి అన్నీ పూర్తికాక ముందే వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఉక్కుపాదం మోపే పనిలో ప్రభుత్వం పడింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లా (26)లో అన్ని హంగులతో కార్యాలయాలను నిర్మించారు. అయితే ఇవన్నీ ల్యాండ్ లీజింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ టీడీపీ ప్రభుత్వం వరుసగా నోటీసులు జారీ చేసింది.

    అమరావతిలో కొనసాగుతున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వారం క్రితం సీఆర్డీఏ అధికారులు వైసీపీకి నోటీసులిచ్చారు. అయితే వాటికి సమాధానం చెప్పకుండా పార్టీ నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో వేకువ జామునే యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై జగన్ స్పందించారు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో సంకేతాలు పంపారని తప్పుపట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయ భవనాలకు నోటీసులు అందజేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనిపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ...

    TDP AP President Palla : కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా

    TDP AP President Palla : టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక...

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...