29.6 C
India
Thursday, July 4, 2024
More

    BBCL Cricket Match : తగ్గేదేలే అంటున్న ‘‘టీమ్ 1983’’.. న్యూజెర్సీలో ‘బీబీసీఎల్’ జోష్!

    Date:

    BBCL Cricket Match Team 1983
    BBCL Cricket Match Team 1983

    BBCL Cricket Match Team 1983 : ఓ పక్క టీమిండియా టీ-20 వరల్డ్ కప్ గెలిచి దేశమంతా సంబురాలు అంబరాన్నంటితే..అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయుల లోకల్ క్రికెట్ లో ‘‘టీమ్ 1983’’ దుమ్మురేపుతున్నది. న్యూజెర్సీలో గత కొన్ని రోజులుగా బ్యాట్ అండ్ బ్యాట్ క్రికెట్ లీగ్(బీబీసీఎల్)  టీ-20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మ్యాచ్ లు జరిగాయి. తాజాగా ఎడిసన్ లోని వుడ్రో విల్సన్ మిడిల్ స్కూల్ క్రికెట్ పార్క్ లో ‘టీమ్ 1983’ మరియు స్ట్రైకర్స్ టీమ్ మ్యాచ్ జరిగింది.

    నిన్న జరిగిన మ్యాచ్ లో ‘టీమ్ 1983’ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీమ్ 1983 మొదటి నుంచి దూకుడుగా ఆడి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇందులో బ్యాటర్ వెంకటసాయి 109 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు ‘స్ట్రైకర్స్’ టీమ్ బ్యాటింగ్ కు దిగింది. అయితే టీమ్ 1983 బౌలర్ల ధాటి ముందు చతికిల పడింది. కేవలం 87 పరుగుల చేసి అలౌట్ అయ్యింది. దీంతో టీమ్ 1983 ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయానికి కారణమైన వెంకటసాయి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.  టీమ్ 1983 వరుస విజయాలతో తగ్గేదేలే అంటూ విజయభేరి మోగిస్తుండడం గమనార్హం.

    కాగా, బ్యాల్ అండ్ బ్యాట్ క్రికెట్ క్లబ్(బీబీసీఎల్) టోర్నీలో  ‘టీమ్ 1983’ను  యూబ్లడ్ ఫౌండర్ డా.జై జగదీశ్ యలమంచిలి గారు స్పాన్సర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లైవ్ కవరేజీని జైస్వరాజ్య టీవీ, జైఎస్ డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డా.శివకుమార్ ఆనంద్ గారు చేశారు.  ఫొటోస్ కర్టసీ బై డా.శివకుమార్ ఆనంద్ గారు, జైస్వరాజ్య టీవీ, జైఎస్ డబ్ల్యూ టీవీ.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya TV & JSW Tv Global Director)

    More Images : BBCL Cricket Match Team 1983 Vs Strikers at Woodrow Wilson Middle School Cricket Park Ediosn NJ

    Share post:

    More like this
    Related

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    NATS : భారత కాన్సుల్ జనరల్ తో నాట్స్ ప్రతినిధుల సమావేశం

    NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATS : భారత కాన్సుల్ జనరల్ తో నాట్స్ ప్రతినిధుల సమావేశం

    NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Varshikotsava Celebrations : ఎడిసన్ న్యూజెర్సీ లో సాయిదత్త పీఠం శ్రీశివవిష్ణు టెంపుల్ 10వ వార్షిక ఉత్సవాలు ప్రారంభం

    Varshikotsava Celebrations : భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక అమెరికాలోనూ వెల్లివిరుస్తోంది. అమెరికాలోని...