29.6 C
India
Thursday, July 4, 2024
More

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    Date:

    TTD Chairman
    TTD Chairman

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ దైవం, శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. స్వామి పిలుపు ఎప్పుడు వస్తుందా తిరుమలకు ఎప్పుడు వెళ్తామా ఎదురు చూస్తుంటారు. అలాంటి తిరుమల పవిత్రతను జగన్ ప్రభుత్వం దిగజారే ప్రయత్నాలు చేసింది. అందుకే 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో స్వామి వారికి (చైర్మన్ గా) సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇద్దరికి దక్కవచ్చన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ముందున్నట్లు సమాచారం. అన్ని నామినేటెడ్ పదవుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే టీటీడీకి అధిపతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విజయనగరం రాజ కుటుంబానికి చెందిన 72 ఏళ్ల వారసుడు అశోక్ గజపతి రాజు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.

    అశోక్ గజపతి రాజు రాజకీయ జీవితం..
    అనుభవజ్ఞుడైన టీడీపీ నాయకుడు, విజయనగరం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గజపతి రాజు అనారోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
    బీఆర్ నాయుడు..
    బీఆర్ నాయుడు విషయానికి వస్తే, ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ పదవి కమ్మవారికి ఇవ్వలేదు. అందువల్ల తొలిసారి ఆ పదవిని ఆ కులానికి ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టడానికి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సారి బీసీలకు మంచి అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందువల్ల టీటీడీ చైర్మన్ పదవి కూడా బీసీలకే ఇస్తారనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    NATS : భారత కాన్సుల్ జనరల్ తో నాట్స్ ప్రతినిధుల సమావేశం

    NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    Kalki Movie Collections : కల్కి మూవీకి వారంలో 370 కోట్లు.. ఇంకా రావాల్సింది ఎంతంటే..?

    Kalki Movie Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్

    CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...