29.8 C
India
Friday, July 5, 2024
More

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    Date:

    DK Shivakumar
    DK Shivakumar and Jagan

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ  అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని.. ఇందుకు కోసమే బెంగుళూరు వెళ్లారని ప్రచారం అయింది. ఈ క్రమంలోనే ఆయన  బెంగళూరులో ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో చర్చలు జరుపుతున్నారని వార్త వైరల్ అవుతోంది. మరోవైపు బీజేపీ నేత, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కూడా.. జగన్ వైసీపీని త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఆరోపించారు.

    కాంగ్రెస్‌లో వైసీపీని విలీనం చేసేందుకు వైఎస్ జగన్ రెడీ అవుతున్నారని .. అయితే ఆయన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితేనే తన పార్టీని విలీనం చేస్తానని జగన్ డిమాండ్ చేసినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. ఐదు రోజుల పర్యటన అనంతరం సొంత నియోజక వర్గం పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిన జగన్.. అక్కడ డీకే శివకుమార్‌తో చర్చలు జరుపుతున్నట్లు  ఆయన ఆరోపించారు.

    కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం జరగబోతుందనే ప్రచారం మరింతగా పెరిగింది. ఇందులో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు రావడం, ఆయనకు వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య  మంచి సంబంధాలే ఉండటంతో.. ఈ ప్రచారానికి మరింతగా బలం చేకూరినట్టు అయింది. గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన కుమార్తె షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయడంలో డీకే శివకుమార్ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంలో డీకే శివకుమార్ పేరు వినిపించడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించారు. ఈ మేరకు డీకే శివకుమార్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నేను కలిశానంటూ కొందరు  ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని నేనెప్పుడూ కలవలేదు. దీన్ని ఎవరూ నమ్మకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన

    Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం...

    Superstar Krishna : మహేష్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సీరియస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ

    Superstar Krishna : మహేష్ బాబు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం...

    BRS Party : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

    BRS Party : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన

    Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం...

    Pawan Kalyan : పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!

    Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్...