26.7 C
India
Saturday, June 29, 2024
More

    TGSRTC : బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ జర్నీ

    Date:

    TGSRTC
    TGSRTC

    TGSRTC : కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో లైఫ్ టైం ఫ్రీ జర్నీ చేసేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చిన్నారికి బర్త్ డే గిఫ్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

    కరీంనగర్ బస్టాండ్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో జూన్ 19న అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు.

    జూన్ 16న కుమారి అనే గర్భిణి, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్టాండ్ కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్ లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    Prabhas : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ సరికొత్త రికార్డు

    Prabhas : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    Telugu in America : అమెరికాలో ‘తెలుగు’ వెలుగులు..అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో 11వ స్థానం!

    Telugu in America : అమెరికాలో తెలుగు వెలుగులు పంచుతోంది..జనాభాలో గణనీయమైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    Government Advisers : ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు

    Government Advisers : తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా పలువురు నియామకం అయ్యారు....

    Twitter War : ఏపీలో ఇలా.. తెలంగాణలో అలా..ట్విట్టర్ వార్ 

    Twitter War : తెలంగాణలో, ఏపీలో పరిపాలనను పోల్చుతూ వైసిపి ట్విట్టర్లో...

    Unbearable Burden : దొర పాలనలో మోయలేని భారం.. చరమగీతానికి ఇదే తరుణం..

    Unbearable Burden : దేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రం ‘తెలంగాణ’. సొంత...