![Actress Rambha](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/heroinerambha-1718157478.webp)
Actress Rambha : తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన హవాను చూపించి ఏళ్ల తరబడి ఆఫర్లను సొంతం చేసుకున్నా హిరోయిన్లలో రంభ ఒకరు. అలాంటి వారిలో సీనియర్ లేడీ రంభ ఒకరు. ఒకప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి దక్షిణాది మొత్తాన్ని తన కంట్రోల్ లో పెట్టుకుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు దగ్గరవుతుంది. రంభ కొన్ని బోల్డు ఫొటోలను తాజాగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది.
రంభ ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా తెరంగ్రేటం చేసింది. అందం, అభినయంతో మెప్పించిన రంభ టాలీవుడ్‌లోని బడా హీరోలు అందరితోనూ కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి అవి పెద్ద హిట్ లుగా నిలవడంతో స్టార్ గా ఎదిగిపోయింది. తెలుగు, హిందీ, తమిళం కన్నడం, మలయాళం, బెంగాళీ, బోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లోనూ హిరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రంభ బిజినెస్ మ్యాన్ పద్మనాథన్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు. కానీ తమిళ, మలయాళ చిత్రాల్లో మాత్రం నటించింది. 2011 తర్వాత బిగ్ స్క్రీన్కు దూరం అయిపోయి ఫ్యామిలీ లైఫ్ ను బిజీ బిజీగా గడుపుతోంది.
ఈ మధ్య కాలంలో హీరోయిన్ రంభ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియా వాడకం పెరగడంతో సీనియర్ హీరోయిన్లు కూడా ఇందులో తమ టాలెంట్ చూపిస్తున్నారు. రంభ మాత్రం విదేశాల్లో ఉన్నా చాలా పద్దతిగానే కనిపిస్తోంది.
కానీ అప్పుడప్పుడూ గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె చేసిన నెక్ లెస్ డ్రెస్ తో క్లీవేజ్ షో చేసింది. దీంతో రంభ అందాల విందును యువత ఆస్వాదిస్తున్నారు. ఆహా 48 ఏండ్లు వచ్చినా వన్నె తరగని అందం అని కామెంట్లు చేస్తున్నారు.