![Mahesh Babu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/mahesh-babu-9.webp)
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంతా క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టైలిష్ అండ్ ఫ్యాషన్ కు మహేశ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. 48 సంవత్సరాల ఉన్న మహేశ్ బాబు ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో కూడా మహేశ్ బాబు ఫేమస్. పాన్ ఇండియా సినిమా చేయకున్నా.. థమ్స్ అప్ యాడ్, మరిన్ని యాడ్స్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.
మహేశ్ బాబు కొన్ని ఈ వెంట్లలో పాల్గొన్న సందర్భంగా ఆయన వేసుకున్న డ్రెస్ లపై ఫ్యాన్స్ ఓ లుక్కేస్తారు. చాలా సింపుల్ గా టీషర్టులు ధరించి వచ్చే మహేశ్ బాబు.. వాటి ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లిన మహేశ్ బాబుకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ వేసుకుని సింపుల్ గా కనిపించాడు. దీంతో ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర ఎంతని అభిమానులు కనుక్కునే ప్రయత్నం చేశారు. అయతే గివెన్చి క్రెస్ట్ టీ షర్ట్ ధర కేవలం రూ. 63,000 అని తెలియడంతో ఫ్యాన్స్ మరో సారి షాక్ కు గురయ్యారు.
ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ లో మహేశ్ నటిస్తున్నాడు. అక్కడికి వెళ్లిన మహేశ్ యాడ్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన మహేశ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఎందుకంటే రూ. 47 వేలు విలువ చేసే టీ షర్టు ధరించిన మహేశ్ ను చూసి ఫ్యాన్స్ అక్కడున్న వారందరూ షాక్ కు గురయ్యారు. పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి మహేశ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
View this post on Instagram