26.7 C
India
Saturday, June 29, 2024
More

    Kalki 2898 AD : ‘కల్కి’ సినిమాకు వెళ్తున్నారా?.. ఈ ఆసక్తికర విషయాలు గుర్తుంచుకోవాలి..

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : భారతీయ సినీ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మైథలాజికల్ సైన్స్ పిక్షన్ గా దీన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. రెండు ట్రైలర్లు రిలీజ్ తో ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ తన వైపునకు తిప్పుకుంది. జూన్‌ 27 (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘కల్కి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అవేంటో చూద్దామా..

    * ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రూ.600 కోట్ల బడ్జెట్ ను ఈ మూవీ క్రాస్ చేసిందట. నటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చుతో పోలిస్తే, ప్రేక్షకులకు మరింత థ్రిల్ పెరగాలని అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసం ఎక్కువ ఖర్చు చేశారు.
    * ఈ మూవీలో అశ్వత్థామగా అమితాబ్‌, సుప్రీం యాస్కిన్‌గా ప్రతినాయకుడి పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించారు. 40 ఏళ్ల విరామ వీరి కలయిక కల్కితో సాధ్యమైంది. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’లో వీరిద్దరూ కలిసి నటించారు. ప్రయాగ్‌ రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన గిరాఫ్తార్ ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రం కావడం విశేషం. ఇదే చిత్రంలో రజనీకాంత్‌ కూడా ఉన్నారు.
    * ‘కల్కి’లో ప్రభాస్‌ వెహికల్‌ను మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌, కోయం బత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ సహకారం అందించారు. ఈ కారు కోసమే రూ. 4 కోట్లు ఖర్చు పెట్టారట.
    * కమల్‌ సుప్రీం యాస్కిన్‌ పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఆయన లుక్‌ కోసం భారీగా టెస్టులు చేశారట. చివరకు చిత్ర బృందం లాస్‌ ఏంజిల్స్ వెళ్లి, హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసే మేకప్‌ మ్యాన్స్ తో ప్రత్యేకంగా కమల్ కు మేకప్ వేయించారు.
    * అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్‌ టీమ్‌లో పెద్ద వయసు (81 సం.) కలిగిన వ్యక్తి. ఆయనకు మేకప్‌ వేసేందుకు 3 గంటల షూటింగ్ పూర్తయిన తర్వాత మేకప్ తీసేందుకు 2 గంటలు పట్టేది. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అమితాబ్‌ చాలా కష్టపడ్డారు. ‘మనం’, ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత బిగ్ బీ నటించిన తెలుగు చిత్రం ఇదే.
    *‘కల్కి’ కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు వెల్లడించారు. వనరులను కోల్పోయిన నిర్జీవమైన కాశీ పట్టణాన్ని చూపించారు. అన్ని వనరులతో ఆకాశంలో కిలో మీటరు మేర ఉండేలా కాంప్లెక్స్‌ను డిజైన్‌ చేశారు. సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. వీటి అవుట్‌ లుక్‌ వీఎఫ్‌ఎక్స్‌లో చూపించారు. ఇందుకు 700 వీఎఫ్‌ఎక్స్‌ షార్ట్స్‌ ఉపయోగించారు. ప్రైమ్‌ ఫోకస్‌, డీఎన్‌ఈజీ, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్‌ తదితర సంస్థలు ఈ సినిమాకు పనిచేశాయి. హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌ స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టీమ్‌ ‘కల్కి’కి పనిచేసింది.
    * ఈ మూవీ టైటిల్ ‘కల్కి 2898 ఏడీ’ వెనుక లాజిక్‌ ఉంది. మూవీ ట్రైలర్‌ లో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘6 వేల సంవత్సరాల క్రితం కనిపించింది.. ఇప్పుడు ఆ పవర్‌ వచ్చిందంటే’ అని అంటాడు.. 2898 నుంచి 6000 సంవత్సరాల వెనక్కి వెళ్తే.. 3102. శ్రీ కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన సంవత్సరం. అంటే 2898 ఏడీలో మళ్లీ శ్రీమహావిష్ణువు ‘కల్కి’గా అవతరించాడని అర్థం. ఈ 6 వేల సంవత్సరాల్లో జరిగిన పరిమాణాలను కూడా టైమ్‌ ట్రావెల్‌ రూపంలో చూపించారని టాక్‌.
    * ఈ మూవీ షూటింగ్‌ కోసం టీమ్ ఐ మ్యాక్స్‌ డిజిటల్‌ కెమెరా వినియోగించింది. యారి అలెక్స్‌ 65, యారి డీఎన్‌ఏ లెన్స్‌ను ఉపయోగించి 6.5కే రిజెల్యూషన్‌లో తీయడం వల్ల ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు అప్‌ స్కేలింగ్‌ ఈజీగా మారింది. దీని వల్ల పిక్చర్‌ క్వాలిటీ స్పష్టంగా ఉంటుంది.
    * దీపిక పదుకొణె నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం.
    * అలనాటి తార శోభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 18 ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు మూవీ ఇదే. ఇందులో మరియం అనే పాత్రను పోషిస్తోంది. 2006లో వచ్చిన మంచు విష్ణు ‘గేమ్‌’లో మోహన్‌బాబు భార్యగా కనిపించింది.
    * నార్త్‌ అమెరికాలో ప్రీ-సేల్స్‌లోనే అత్యంత వేగంగా 3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన మూవీగా నిలిచింది.
    * కారులో ఉండే బుజ్జి (AI) పాత్రకు కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.
    * ప్రాజెక్ట్‌-కే పేరుతో 2020, ఫిబ్రవరి 26న వైజయంతీ మూవీస్‌ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ మూవీ పూర్తయ్యేందుకు నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టింది.
    * సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీ కోసం పనిచేశారు. తనకున్న అనుభవంను యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ తో పంచుకొని సలహాలు, సూచనలు చేశారు.
    * భారీ తారాగణంతో ఉన్న ఈ చిత్రంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. కొందరు ముఖ్య నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. నాని, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ తళుక్కున మెరుస్తారట. ఇది నిజమో? అబద్దమో? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
    * పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ‘కల్కి’ వివిధ ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. 2D, 3D, IMAX, 4DX లోనూ రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు మూవీ ‘కల్కి’ ఇదే కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    Prabhas : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ సరికొత్త రికార్డు

    Prabhas : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన...

    Prabhas : ప్రభాస్ మాటంటే మాట.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ఫ్లాన్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి...

    Kalki 2898 AD : కల్కి సినిమా లో కృష్ణుడి పాత్రధారి ఇతడేనా.. వైరల్ అవుతున్న ఫొటో

    Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను  పురాణాలు,...

    Venu Swamy : వేణుస్వామి జాతకాలు చెప్పడం మానేసి మూలన కూర్చో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

    Venu Swamy : జ్యోతిష్కుడు వేణు స్వామికి గడ్డు రోజులు నడుస్తున్నాయి....