తాజాగా ‘భోళా శంకర్’ లో చిరు తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిరు ట్విటర్ వేదికగా ‘ #BholaaShankar డబ్బింగ్ కు
ఇది ముగింపు. సినిమా ఎలా రూపుదిద్దుకుందో చూసి చాలా సంతోషం గా ఉంది. ఇది ఖచ్చితంగా ఫైర్ మాస్ ఎంటర్టైనర్ మరియు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్ లో విడుదల తేదిని మార్క్ చేయండి. సినిమాల్లో కలుద్దాం..!’ తెలియజేసారు.
‘భోళా శంకర్’ లో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరు సోదరిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం
విజయవంతమై భారీ మొత్తంలో వసూళ్లను అందుకుంటుందని అలాగే తెలుగు సినీ పరిశ్రమ లో మరొక మైలురాయిని అందుకుంటుందని సినీ వర్గాల అభిప్రాయం. వీరి అంచనా నిజమైతే అటు మెగా అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ లోని వారి ఆనందానికి అవధులు ఉండవనే మాట వాస్తవం.
ReplyForward
|