![Surekha](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-15-at-6.37.40-PM.jpeg)
Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేసిన విజయం సాధించిన పవన్ కల్యా్ణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీ వందశాతం స్ర్టైక్ రేట్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినీ పరిశ్రమలోనూ పవన్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన అన్నయ్యను ఎవరైనా చిన్న మాట అంటే ఊరుకోడు. ఈగ వాలనివ్వకుండా చూసుకుంటాడు. అది సినీ పరిశ్రమలో కావచ్చు. రాజకీయాల్లో కావచ్చు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కల్యాన్ కు ఇష్టం లేదు. అప్పటి నుంచి మెగాస్టార్ ఇంటికి వ్యక్తిగతంగా దూరంగా ఉన్నా వారి మధ్య అనుబంధాలు మాత్రం తగ్గలేదు.
వదిన సురేఖ పై ఎనలేని గౌరవం
ఇక మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అంటే పవన్ కల్యాన్ కు ఎనలేని గౌరవం. తాను సినిమాల్లోకి రాకముందు తనకు ఏదైనా కావాలంటే ముందుగా తన వదినమ్మనే సంప్రదించే వాడినని చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు పవన్ కల్యాన్. వదిన సురేఖ కూడా పవన్ కల్యాన్ ను తన పెద్ద కొడుకు లాగే భావిస్తుంది. వారి మధ్య అంతటి బాండింగ్ ఉంటుంది. ఉమ్మడి కుటంబంలో ఆప్యాయతలకు మెగా ఫ్యామిలీని ఉదాహరణగా చెప్పవచ్చు
పెద్ద కొడుకుకు గిఫ్ట్..
పవన్ కల్యాన్ ను పెద్ద కొడుకు లా భావించే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ జనసేన అధినేతకు పెన్ను గిఫ్ట్ గా ఇచ్చింది. ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాలనలో అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫైళ్లపై డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. పాలనలో తనదైన ముద్ర ఉండేలా చూసుకోవాలని వదినమ్మ సురేఖ పవన్ కల్యా్ణ్ కు పెన్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తున్నది.