Devarakadra Assembly Review :
గ్రౌండ్ రిపోర్ట్: దేవరకద్రలో ద్విముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: దేవరకద్ర
బీఆర్ఎస్: ఆల వెంకటేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్: జీ మధుసూదన్ రెడ్డి! ప్రదీప్ కుమార్ గౌడ్!
బీజేపీ: బాలకృష్ణ (బాలన్న)
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘దేవరకద్ర’ ఒకటి. ఇది ఆ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. 2007 డీలిమిటేషన్ లో భాగంగా అమరచింత నుంచి విడిపోయి ఏర్పడింది. ఇందులో 5 మండలాలు ఉన్నాయి. అడ్డాకల్, భూత్‌పూర్, దేవరకద్ర, చిన్న చింతకుంట, కొత్తకోట, దేవరకద్ర. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2,55,570 మంది ఉండగా ఇందులో ఓటర్లు (ఆగస్ట్ 2008 నాటికి) 2,13,385 మంది ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగి ఉంది. ఉత్తరాన మహబూబ్‌నగర్, ఈ శాన్యాన జడ్చర్ల, నాగర్‌కర్నూల్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున వనపర్తి, పశ్చిమాన మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగి ఉంది. నియోజకవర్గం గుండా దేవరకద్ర మండలం మీదుగా హైదరాబాద్ – రాయచూరు ప్రధాన రహదారి, ఉత్తరం నుంచి దక్షిణంగా భూత్‌పూర్, అడ్డకల్, కొత్తకోట మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇక్కడి నుంచి రెండోసారి 2018లో గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ రెడ్డిపై విజయం సాధిచారు. బీజేపీ కూడా ఒక మోస్తరు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2009 ఎన్నికలలో టీడీపీ నేతలు దయాకర్ రెడ్డి ఆయన భార్య సీత రెండు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ ఓటమిపాయ్యారు.
దేవరకద్రలో సీతా దయాకర్ రెడ్డి తెలుగుదేశం పక్షాన పోటీ చేసి రెండో స్థానంలో కూడా నిలవలేదు. 2014లో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) నేత వెంకటేశ్వర్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పవన్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. దయాకర్ రెడ్డి ఒకసారి మక్తల్, రెండు సార్లు అమరచింత నుంచి గెలుపొందారు.
ఈ నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు కంచుకోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఈ సారి సిట్టింగ్ లకే టికెట్ అన్న కేసీఆర్ హామీతో తనకే సీటు దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. కానీ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఈ సారి గట్టిపోటీనే ఎదుర్కోబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది.
కాంగ్రెస్
ఎన్నికలు దగ్గర పడుతున్నా కాంగ్రెస్ లో మాత్రం వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. తనకే టికెట్ వస్తుందని నేతలు గంపెడు ఆశలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జీ మధుసూదన్ రెడ్డి స్థానిక సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్నా.. మరో సీనియర్ నాయకుడు ప్రదీప్ కుమార్ కూడా తనకే టికెట్ వస్తుందని పనులు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి టికెట్ మాత్రం మధుసూదన్ రెడ్డినే వరిస్తుందని స్థానిక కేడర్ లో చర్చ మొదలైంది. మొదటి నుంచి నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న నేత మధుసూదన్ రెడ్డి టీడీపీ తర్వాత ఎక్కువ ఓట్లు దక్కించుకున్న పార్టీ కాబట్టి ఈ సారి తామే గెలుస్తామని కాంగ్రెస్ కేడర్ గంపెడు ఆశలతో ఉంది.
బీజేపీ
భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక నేత బాలకృష్ణ (బాలన్న). హైదరాబాద్ లోని మీర్‌పేట కార్పొరేటర్ గా పని చేసిన ఈయన బీసీ వర్గానికి చెందిన వారు. ఈయనకు నియోజవకర్గంపై మంచి పట్టు ఉంది. దీనికి తోడు నిధులపై కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించే పనులు చేస్తుంటాడు. బీసీ నాయకుడు కావడంతో ఈయనకు గెలిచే అవకాశాలు ఉన్నా.. అక్కడ బీజేపీకి సరైన కేడర్ లేదు. గతంలో టీడీపీ కేడర్ బీజేపీ వైపు రాకుండా కాంగ్రెస్ వైపు మళ్లింది. స్వరాష్ట్రం అనంతరం బీఆర్ఎస్ వైపు వెళ్లడంతో అక్కడ కేడర్ లేకుండా పోయింది. అయినా కూడా గంపెడు ఆశలతో బాలన్న బరిలో నిలువనున్నారు.