27.4 C
India
Friday, June 21, 2024
More

    Beer : వామ్మో ఆ రాష్ట్రంలో బీర్లు ఇంత తాగుతున్నారా?

    Date:

    Beer
    Beer

    Beer : పైన ఎండ పెరుగుతున్నా కొద్దీ.. కడుపులోకి చల్లని బీర్లు వెళ్తున్నాయి. బీర్లే ఎందుకు తాగాలంటే సోడా, టేస్ట్ అన్నీ మిక్స్ చేశారు కాబట్టి బీరు బాగుంటుంది. సరే రోజుకు ఒకటి, సమ్మర్ కాబట్టి రెండు, లేదంటే మూడు కానీ బీరు ప్రియులు మాత్రం రోజుకు 5 లేదంటే 6 వరకు తాగేస్తున్నారంట.

    ప్రతీ వేసవిలో అధిక డిమాండ్ కారణంగా రెండు వారాలపాటు సరఫరా తగ్గుతుంది ఇది కామనే. కానీ ఈ సారి మాత్రం ఇది పెరుగుతుంది. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ ఓనర్ ఇలా అన్నారు ‘గతేడాది, మేము గరిష్టంగా 2-3 రోజుల పాటు బీర్లు కొరత ఉండడం గమనించాం. కానీ ఇప్పుడు, మేము కష్టపడుతున్నాం. కస్టమర్ల డిమాండ్‌ తీర్చేందుకు 25 రోజుల వరకు బీర్ల కొరత ఉంది. అవసరం మేరకు సరఫరా కావడం లేదు. దాదాపు రెండు నుంచి మూడు రోజులకు వంద కేసులు కావాలి. కానీ తొమ్మిది, పది కేసులు మాత్రమే ఇస్తున్నారు.

    హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నెల రోజులుగా తనకు ఇష్టమైన బ్రాండ్‌ బీర్‌ లభించడం లేదని చెప్తున్నాడు. ‘కింగ్‌ ఫిషర్చ బడ్వయిజర్ ఇప్పుడు నగరంలో అందుబాటులో లేవు. టోనిక్ వంటి పాష్ లిక్కర్ మార్ట్‌లు కూడా జర్మన్ బ్రాండ్‌ బీర్లను నిల్వ చేస్తున్నాయి. అవి 2-3 రెట్లు ఎక్కువ ఖరీదైనవి, వైన్ లాగా రుచిగా ఉంటాయి. కరోనా వంటి ప్రీమియం బీర్ స్థానిక వైన్ షాపుల్లో దొరుకుతుంది,’ అని అతను చెప్పాడు.

    తెలంగాణలో 19 మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో 6 బీర్లు తయారు చేసే కంపెనీలు. ఈ బ్రూవరీల్లో ప్రతీ నెలా 50 లక్షల బీరు కేసులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కంపెనీలకు రాష్ట్రమే ముడిసరుకును సరఫరా చేస్తుంది. ఆ తర్వాత మద్యం తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిటైలర్లకు పంపిణీ చేయబడుతుంది.

    ఉత్పత్తిలో కొరత ఏర్పడినప్పుడల్లా కార్పొరేషన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీరు కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో 2,620 మంది రిటైలర్లు ఉండగా 19 డిపోల ద్వారా మద్యం పంపిణీ చేస్తున్నారు.

    కొరత వెనుక కారణాల గురించి తెలుసుకున్నప్పడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక అధికారి ఇలా అన్నారు ‘కొరత వెనుక ఉన్న కారణాలలో ఒకటి చాలా మంది చిల్లర వ్యాపారులు మద్యంను లైసెన్స్ లేని (బెల్ట్) షాపులకు ఎక్కువ ధరకు అమ్మడం. కొన్ని సార్లు, డిపోలు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి ఇలా చేస్తాయి. కింగ్‌ ఫిషర్, బడ్వయిజర్ లైట్ బీర్లు, మహిళలు, యంగ్ లేడీస్ కూడా తాగుతున్నారు. గతేడాది ఏప్రిల్ వరకు 42 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ ఏడాది మే 23 వరకు 52 లక్షల కేసులను దాటింది. కాబట్టి, అధిక డిమాండ్‌ను తీర్చడం తయారీదారులకు కష్టమవుతోంది.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral News : చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..

    శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్.. Viral News...

    RTC Staff Attack : ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి – సోషల్ మీడియాలో వైరల్

    RTC Staff Attack : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్...

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....