24.6 C
India
Sunday, June 30, 2024
More

    Rohith Sharma : ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ.. ఓదార్చిన టీం మెంబర్స్

    Date:

    Rohith Sharma Emotional
    Rohith Sharma Emotional

    Rohith Sharma : టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై ఇండియా విజయం సాధించడం తో ఫైనల్ కు దూసుకెళ్లగా అందరూ సంబరాలు చేసుకోగా.. రోహిత్ శర్మ మాత్రం డగౌట్ లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. టీం ఇండియా తరఫున  మొదటి ప్రపంచ కప్ గెలిచిన టీంలో రోహిత్ శర్మ సభ్యుడు కావడం విశేషం. 2007 లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ లో కూడా కీలక ఇన్సింగ్స్ ఆడాడు.

    2007 లో కొన్ని కీలక ఇన్సింగ్స్ లు ఆడిన రోహిత్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ  టీ 20 వరల్డ్ కప్ నెగ్గలేదు. సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న రోహిత్ టీం ఇండియా కెప్టెన్ గా కూడా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో 27 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ 24 మ్యాచుల్లో గెలిపించాడు. కేవలం అతడి సారథ్యంలో మూడు మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. రోహిత్ ప్లేయర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా విజయవంతమయ్యాడు.

    రోహిత్ శర్మ కెప్టెన్ గా 2019 ప్రపంచకప్ లో దిగ్విజయంగా దూసుకెళ్లిన టీం ఇండియా ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో జట్టు ఆటగాళ్లతో పాటు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఏడ్చుకుంటూ మైదానాన్ని వీడిన క్షణం కోట్ల మంది అభిమానుల గుండెలను పిండేశాయి. బాధతో బరువెక్కాయి. కానీ ఈ సారి అలా కాకూడదని అందరూ కోరుకుంటున్నారు.

    ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి సగర్వంగా వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నారు. రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం డగౌట్ లో కూర్చుని ఏడ్చిన వీడియో, ఫొటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కెప్టెన్ కు అండగా నిలుస్తున్నారు. ఈ సారి కచ్చితంగా కప్ మనదే నువ్వు ఎప్పటికీ మా హిరోవే అంటూ అభిమానం అండగా నిలుస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    England Vs America : అమెరికాను చిత్తు చేసిన ఇంగ్లాండ్..  

    England Vs America : ఇంగ్లండ్ తన టైటిల్‌ను కాపాడుకునే దిశగా...

    India Vs Afghanistan : ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ అంత సులువేం కాదు..

    India Vs Afghanistan : టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా సూపర్‌-8లో...

    INDIA Vs USA : యూఎస్ఏపై ఇండియా సూపర్ విక్టరీ

    INDIA Vs USA : టీ 20 వరల్డ్ కప్ లో...