33.5 C
India
Monday, June 24, 2024
More

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    Date:

    New Jersey
    T20 Cricket Match League New Jersey

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ క్రికెట్ ఉంటుంది. భారతీయులకు క్రికెట్ ఆటే శ్వాస..ధ్యాస. క్రికెటర్లు ఆరాధ్య దైవాలు. అందుకే మన వాళ్లు ఏ దేశమేగినా అక్కడ క్రికెట్ మ్యాచ్ లు తప్పనిసరి. ఇక అమెరికాలో వీకెండ్స్ లో భారతీయులు క్రికెట్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. రీసెంట్ గా అమెరికాలో టీ-20 వరల్డ్ కప్ టోర్నీ కూడా జరుగుతుండడంతో ఉత్తర అమెరికా ప్రాంతాల్లో క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. కాగా, పలుచోట్ల భారతీయులు క్రికెట్ టోర్నీలు ఆడుతూ ఆస్వాదిస్తున్నారు.

    తాజాగా యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి స్పాన్సర్ షిప్ లో బ్యాట్ అండ్ బ్యాట్ క్రికెట్ లీగ్(టీ-20 ) నిర్వహించారు. దీనికి జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్ డబ్ల్యూ టీవీ గ్లోబర్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు సహకారం అందించారు.

    ఈనెల 15న సాయంత్రం న్యూజెర్సీ ఎడిసన్ లోని వెస్ట్ విన్డార్స్ కమ్యూనిటీ పార్క్ లో ‘టీమ్ 1983’, ‘ఎన్ జే హాక్స్’ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ టీ-20 మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ‘టీమ్ 1983’ జట్టు 7 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ‘ఎన్ జే హాక్స్’ జట్టు  10 వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ‘టీమ్ 1983’ జట్టు 102 పరుగులతో ఘన విజయం సాధించింది.

    ‘టీమ్ 1983’ జట్టు తరుఫున వంశీ టాప్ స్కోరర్ గా నిలిచారు. కేవలం 43 బంతుల్లో 106 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడికి వెంకట్ సహకారమందించి 41 పరుగులు చేశాడు. ఇక ఎన్ జే హాక్స్ జట్టులో సికిందర్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే హాక్స్ జట్టును టీమ్ 1983 బౌలర్లు 147 పరుగులకే కట్టడి చేసి 102 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నారు.

    స్కోరు వివరాలు:

    టీమ్ 1983 ఇన్నింగ్స్:

    వంశీ వై 106(43)
    వెంకట్ ఎస్ 41(23)
    వెంకీ ఆర్ 27(13)

    బౌలింగ్: ధర్మేష్ ఎస్ 2-37(3 ఓవర్లు), నాధున్ ఏ 2-40(2.5ఓవర్లు), సయ్యద్ రాజా జడ్ 1-16(2 ఓవర్లు)

    ఎన్ జే హాక్స్ ఇన్నింగ్స్:

    సికందర్ ఏ 45(23)
    షామ్రాజ్ ఏ 27(17)
    ఆహ్మెర్ ఐ 20(13)

    బౌలింగ్: వెంకీ ఆర్ 3-13(1.5ఓవర్లు), వెంకట్ ఎస్ 2-13(2 ఓవర్లు), రాఘవ కల్యాణ్ 2-16(3ఓవర్లు)

    Photos courtesy of Dr. Shivakumar Anand, Global Director, JSW TV, Jeswarajya TV

    Share post:

    More like this
    Related

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : సెమీ ఫైనల్ కు చేరు జట్లు ఇవే..

    T20 World Cup 2024  : టీ 20 ప్రపంచ కప్...

    Cultural Workshop : తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో కల్చరల్ వర్క్ షాప్

    Cultural Workshop : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలలో విస్తృతంగా చాటేందుకు...

    Dr. Jai Yalamanchili : జగన్ విశాఖ రిషికొండ జగన్ విలాసాలపై ముందే చెప్పిన జై గారు

    Dr. Jai Yalamanchili : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం...