38 C
India
Saturday, May 11, 2024
More

    Thomas Sean Connery : ఇతన్ని గుర్తు పట్టారా.. ఒకప్పటి మన ‘జేమ్స్ బాండ్’.. ఎవరంటే?

    Date:

    Film actor Thomas Sean Connery's latest photo goes viral
    Film actor Thomas Sean Connery’s latest photo goes viral

    Thomas Sean Connery :

    సర్ థామస్ సీన్ కానరీ అని కొంత మందికి తెలిసినా ‘జేమ్స్ బాండ్’ అంటే అందరికీ సుపరిచితం. సర్ థామస్ సీన్ కానరీ స్కాటిష్ కు చెందిన చలన చిత్ర నటుడు. 1962 నుంచి 1983 మధ్య కాలంలో ఏడు జేమ్స్ బాండ్ చిత్రాలలో ఆయన నటించారు. ఆయన సుధీర్ఘ చలన చిత్ర కెరీర్ లో BAFTA అవార్డు,  అకాడమీ అవార్డుతో సహా మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, అనేక ప్రశంసలను అందుకున్నారు.

    కెరీర్ లో స్థిరపడేందుకు కఠోరమైన శ్రమ పడ్డాడు సర్ థామస్ సీన్ కానరీ. ఒక్కో సినిమాకు తను ఒక్కోలా కినిపించేందుకు ఆరాటపడేవారు. ప్రతీ చిత్రం తనలో కొత్త కోనాన్ని ఆవిష్కరించేది. అలా ఆయన కెరీర్ లో ఓటమి ఎరుగని నటుడిగా ఎదుగుతూ వచ్చారు. 1951 లో ప్రారంభించిన తన కెరీర్ సుదీర్ఘంగా కొనసాగింది.

    ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. శరీరం వృద్ధాప్యానికి వచ్చింది. అంగరక్షకుడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. న్యూయార్క్ లో ఆయన సంచరిస్తున్నప్పుడు తమ ఆరాధ్య పాత్రలో నటించిన వ్యక్తి జేమ్స్ బాండ్ అని ఆయన అభిమానులు గుర్తించలేకపోయారు. కుడి చేతిలో చేతికర్రను పట్టుకోగా.. అంగరక్షకుడు తన ఎడమ చేయిని పట్టుకొని రోడ్డు దాటిస్తూ కనిపించాడు. బాండ్ సినిమాలో లాగానే క్యాప్ పెట్టుకున్నాడు.

    ఒకప్పుడు పెద్ద స్క్రీన్‌లపై మెరుపు తీగ. ఈ రోజు బలహీనంగా కనిపించారు. నడవడానికి సాయం కావాలి. మన అహంకారాన్ని పాతిపెట్టడానికి మరియు మన జీవితాల్లో వినయం సర్వోన్నతంగా ఉండడానికి ఈ సన్నివేశం పనికి వస్తుంది. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా, ఎన్ని ఫైట్లు చేసినా భారీ స్క్రీన్లపై మెరుపుతీగలా కనిపించినా జీవితం చరమాంకంలో సహాయం తీసుకోక తప్పదు.

    Share post:

    More like this
    Related

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related