24.6 C
India
Sunday, June 30, 2024
More

    Vandhe Bharat Trains : ఐదు వందే భారత్ ట్రైన్లు.. ఒకే రోజు ప్రారంభించిన మోదీ

    Date:

    Vandhe Bharat Trains
    Vandhe Bharat Trains

    Vandhe Bharat Trains : ఇటీవల దేశంలో వందే భారత్ ట్రైన్లకు ప్రాచుర్యం పెరుగుతున్నది. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ రైళ్లు సామాన్య ప్రజల ఆదరణను పొందుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోనూ ప్రస్తుతం ఈ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. అయితే మంగళవారం ఒకే రోజు ఐదు కొత్త వందే భారత్ ట్రైన్లను పట్టాలెక్కించారు. ప్రధాని మోదీ స్వయంగా జెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.

    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పీఎం నరేంద్రమోదీ  జెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను కలిపేలా ఈ రైళ్లు పట్టాలపై పరిగెత్తనున్నాయి.
    మంగళవారం ఉదయం రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, భోపాల్(రాణికమలాపతి) జులుర్, ఖజురహో భోపాల్ – ఇందౌర్, హతియా-పట్నా, ధార్వాడ్ – బెంగళూరు: గోవా(మర్గావ్)- ముంబయి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ను ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను స్వయంగా, మిగతా మూడు రైళ్లను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ వందేభారత్ రైలులో ప్రయాణించి చిన్నారులతో ఆయన ముచ్చటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీ వెంట ఉన్నారు. ఒకే రోజు ఇన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే మొదటిసారి.

    అంతకుముందు ఉదయం భోపాల్ ఎయిర్ పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్కు ప్రధాని హెలికాప్టర్లో చేరుకోవాల్సి ఉంది. వాతావరణం అనుకూలించని కారణంగా ఆయన రోడ్డు మార్గంతో స్టేషన్ కు చేరుకున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జి ఆశిష్ అగర్వాల్ తెలిపారు. అయితే మధ్యప్రదేశ్లో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ పై మోదీ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఐదు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించినట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికలున్నాయంటే ఆ రాష్ర్టంలో మోదీ వాలిపోతారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Nalanda University : మహోన్నత ఖ్యాతి నలంద విశ్వవిద్యాలయం సొంతం.. దాని గురించి ఎంత చెప్పిన తక్కువే.. ప్రధాని మోదీ 

    Nalanda University : పురాతన విశ్వ విద్యాలయం అనగానే నలంద విశ్వవిద్యాలయం గుర్తుకు...

    Rahul Gandhi : నీట్ రద్దు చేయాలి.. లీకేజీకి మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ

    Rahul Gandhi : నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన...