Horoscope మేష రాశి వారికి ఒత్తిడిని జయించి ముందుకు వెళతారు. పని భారం అధికమవుతుంది. కుటుంబంలో మాట పట్టింపులొద్దు. దుర్గాదేవి శ్లోకం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
వృషభ రాశి వారికి మనోధైర్యమే అండగా నిలుస్తుంది. శుభ కార్యాల ప్రస్తావన వస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
మిథున రాశి వారు ఉత్సాహంగా పనిచేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి వారికి బుద్ధి బలంతో ముందుకు వెళతారు. గొడవలకు వెళ్లడం మంచిది కాదు. దత్తాత్రేయ స్వామిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన మంచి జరిగేందుకు కారణమవుతుంది.
కన్య రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. దుర్గాదేవి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుర్గా దేవి నామాన్ని చదవడం మంచిది.
వృశ్చిక రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. శివ అష్టోత్తర శత నామావళి పఠించడం మంచిది.
ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు పూర్తవుతాయి. తెలివితో పనులు చక్కబెడతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.
మకర రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది.
కుంభ రాశి వారికి మనోధైర్యం ఉంటుంది. చేపట్టే పనుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. గణపతి ఆరాధన చేయడం మంచిది.
మీన రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కనకధారాస్తవం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.