33.2 C
India
Sunday, May 19, 2024
More

    Vamu Churanam : వాము చూర్ణంతో ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా?

    Date:

    Vamu Churanam
    Vamu Churanam

    Vamu Churanam : ఆయుర్వేదంలో వాముకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీన్ని ఓమ అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. వంటింట్లో ఉండే ఈ దినుసుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మంచి సువాసన ఉన్న ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. వామును వేడి నీటితో కలిపి తీసుకుంటే ఈ సమస్య పోతుంది. ఆహారం జీర్ణం చేయడంలో వాము సాయపడుతుంది. వామును కూరలు, పరోటాలు, రొట్టెలు, పకోడీలలో వేస్తే రుచిగా ఉంటుంది.

    అజీర్తి సమస్య ఉన్న వారు వాము, ఉప్పు, మిరియాలు సమంగా తీసుకుని చూర్ణం చేసుకుని ప్రతిరోజు భోజనానికి ముందు తాగితే అజీర్ణం నుంచి విముక్తి పొందవచ్చు. వయసు మళ్లిన వారికి కీళ్లనొప్పులు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. వాము కీళ్ల నొప్పులను నయం చేసే శక్తి కలిగి ఉంటుంది. వాము నూనెతో కీళ్లపై మర్దన చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

    గుండె జబ్బులకు కూడా వాము అడ్డుగా నిలుస్తుంది. జలుబు, తలనొప్పి వంటి జబ్బులకు వాము ఔషధంగా పనిచేస్తుంది. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు సమస్య దూరం అవుతుంది. వాము మూత్ర కోశ వ్యాధులకు మందులా ఉపయోగపడుతుంది. వామును తరచుగా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడినా అవి కరగడానికి దోహదపడుతుంది.

    గర్భవతులు తరచు వాము తీసుకుంటే చాలా ప్రయోజనాలు దక్కుతాయి. వాము రక్తాన్ని శుభ్రం చేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చేస్తుంది. ఇలా వాము మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటి తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి అందులో ఉప్పు వేసి నీరు తాగితే వాంతులకు మందులా పనిచేస్తుంది.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు...

    Healthy food : ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి?

    Healthy food : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలు ప్రధానం....

    Purify the blood : రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలేంటో తెలుసా?

    Purify the blood : మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం...