![Kalki 2898 AD](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/kalki-2898-1.jpg)
Kalki 2898 AD : ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రూ. 600 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దిశా పటానీ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ పాత్రలో నటించబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. నాగ్ అశ్విన్ దీనిపై ఇప్పటి దాకా స్పందించలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ ఫామ్ చేయడం లేదు. సీతారామంతో సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం నటిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. నటీనటుల విషయంలో మేకర్స్ మాత్రం స్పష్టత నివ్వడం లేదు. సినిమా సబ్జెక్టు ఏంటో మాత్రం చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్..
కల్కి, భైరవ.. రెండూ ఒక్కరేనా?
ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రను పరిచడం చేసిన సంగతి తెలిసిందే. ఇక కల్కి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే అంశంపై చాలా రోజులుగా టాక్ నడుస్తున్నది. రీసెంట్ గా కల్కి పాత్రను విజయ్ దేవరకొండ చేస్తున్నాడని గాసిప్స్ కూడా వినిపించాయి. దీనిపై క్లారిటీ లేదు. ఇక అందరికీ షాకిస్తూ కల్కి పాత్రలో కనిపించేది ప్రభాసేనంటూ మరో కొత్త న్యూస్ వినిపిస్తున్నది. భైరవకు, కల్కికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, భైరవ- కల్కి ఎందుకు కలవాల్సి వచ్చింది, వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది. ఇలా అనే పలు రకాల ప్రశ్నలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరి వాటి అన్నింటికీ సమాధానం ఇస్తూ ఈ మూవీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఇక ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి భారీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.
ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇటీవల, ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. దిశా పటాని మినహా మిగతా స్టార్లంతా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక దీపికా పదుకొణె తన బేబీ బంప్ తో టాక్ ది ఇండస్ర్టీగా నిలిచారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సరదా సంభాషణలు మీమర్స్ కు పని చెప్పాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి.