40.2 C
India
Sunday, May 19, 2024
More

    Jabardasth Fame Faima Breakup : బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసిన ఫైమా.. ఏడ్చేసిన జబర్దస్త్ ఫేం ప్రవీణ్

    Date:

    Jabardasth Fame Praveen Faima Breakup
    Jabardasth Fame Praveen Faima Breakup
    Jabardasth Fame Faima Breakup : జబర్దస్త్ ఫేం ఫైమా షేక్, ప్రవీణ్ లవ్ ట్రాక్ పట్టాలు తప్పిందని తెలుస్తోంది. ఫైమా ప్రవీణ్ ను మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనిపై స్వయంగా ప్రవీణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
    జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో ఫైమా అగ్రస్థానంలో ఉంటుంది. ఆమె తన మార్క్ కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఫుల్ పాపులర్ అయ్యింది. ఫైమా బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఫుల్ కామెడీ చేయడంతో పాటు ఫుల్ ఎనర్జటిక్ గా గేమ్ లు ఆడి ఫైనల్ కు ముందు ఎలిమినేట్ అయ్యింది. అంచనాలకు మించి రాణించి మంచి పేరు సంపాదించుకుంది.
    ఇక బుల్లితెర కమెడియన్ ప్రవీణ్ జబర్దస్త్ తో పాటు ఈటీవీ ఈవెంట్లలలో తెగ నవ్విస్తూ ఉంటాడు. ఇతడితో ఫైమా చాలాకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ఫైమా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగా ప్రవీణ్ గ్రాండ్ వెల్ కం చెప్పాడు. తన మెడలో ఉన్న బంగారు చైన్ ను ఫైమాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ చైన్ శాశ్వతంగా తనదే అంటూ ఫైమా మురిసిపోయింది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని అప్పట్లోనే అందరికీ అర్థమైపోయింది.
    ప్రవీణ్ పై ఉన్న లవ్ ను ఫైమా కూడా బిగ్ బాస్ లో పలుమార్లు ప్రస్తావించింది. తనను, తన కుటుంబాన్ని కష్టసమయాల్లో ఆదుకున్నాడని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. అయితే ఫైమా తన ప్రేమను రిజెక్ట్ చేసినట్టు ప్రవీణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదనతో చెప్పాడు.
    ఫైమాతో తన ప్రేమ.. ఫ్రెండ్ షిప్ తో మొదలైందని.. అందుకే ఐ లవ్ యూ చెప్పానని అన్నాడు. అయితే ఫైమా రిజెక్ట్ చేసినట్టు చెప్పాడు. అందుకు ఫైమాపై ఎలాంటి కోపం లేదని, ప్రేమను అంగీకరించకున్నా.. మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే తన ప్రేమను ఫైమా అంగీకరించకపోవడంతో చాలా బాధగా ఉందని వాపోయాడు. తన ఫస్ట్ లవ్ ఫెయిల్ కావడంతో ఏడ్చేశాను అన్నాడు. అయితే తర్వాత రియలైజ్ అయ్యానని.. ఇప్పుడు తన ఫోకస్ అంతా కెరీర్, ఫ్యామిలీపైనే అని చెప్పాడు. ఇటీవల తన నాన్న చనిపోయాడని, తన ఫ్యామిలీకి ఉన్న అప్పులను తీర్చే పనిలో ఉన్నట్టు తెలిపాడు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Film : కేసీఆర్ సినిమా కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ టీం లీడర్ ఆవేదన..

    KCR Film : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన జబర్దస్త్...

    Ritu Choudhary : బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న రీతూ చౌదరి!

    Ritu Choudhary : తెలుగు భామలు ఎంతో మంది బుల్లితెరపై రాణిస్తున్నారు.....

    Yadamma Raju : ఆ భాగం తొలగింపు.. యాక్సిడెంట్ తర్వాత యాదమ్మ రాజు పరిస్థితి ఇదీ

    Yadamma Raju కామెడీ షోలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ దృష్టిని...