26.1 C
India
Tuesday, July 2, 2024
More

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Date:

    Ashwinidath
    Ashwinidath

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’  వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ప్రభాస్ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ విశ్లేషకులు సైతం ఇదే చెబుతున్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు కొల్లగొట్టింది. నేడో, రేపో రూ.500 కోట్లు దాటడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండగా చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణె వంటి లాంటి స్టార్లపై నమ్మకంతోనే ‘కల్కి’ప్రాజెక్ట్‌ మొదలుపెట్టడానికి అశ్వినీదత్ తెలిపారు. నాగ్‌ అశ్విన్‌ విజువలైజేషన్‌ను ప్రశంసించారు.

    ఏదడిగినా నో చెప్పొద్దన్నా
    నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా చేసిన తర్వాత ఎంత పెద్ద చిత్రమైనా తీయగలడన్న నమ్మకం కలిగిందన్నారు అశ్వినీదత్. ఈ విషయం తన కూతుళ్లు సైతం చెప్పాన్నారు . అతడు ఏ సబ్జెక్ట్‌ చెప్పినా కాదనకుండా ముందుకువెళ్లమని సూచించాడు. తాను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటిపోయిందని వెల్లడించారు. తన మొదటి సినిమా నుంచి దర్శకుడు చెప్పింది విని, అతని విజన్‌కు ఏం కావాలో అందిస్తూ వచ్చానని,  ఇదేంటని ఎప్పుడూ దర్శకుడిని ప్రశ్నించలేదని చెప్పారు.

    యాస్కిన్‌ పాత్రకు కమల్‌ ను  అనుకోలేదట!
    ‘‘కల్కి’ చూసిన తర్వాత ఇండస్ర్టీ పెద్దలంతా నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమితాబ్‌ ను ఎలాగైతే చూపించాలనుకున్నారో..  నాగీ తాన అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. కృష్ణుడి పాత్రకు ముందుగా ఎవరినీ అనుకోలేదని, అందుకే సినిమాలోనూ ఆ పాత్ర ముఖాన్ని రివీల్‌ చేయలేదని చెప్పుకొచ్చారు అశ్వినీదత్. అయితే సినిమా ప్రారంభించడానికి ముందు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సూచనలు తీసుకున్నామని, మూవీ మరింత బాగా రావడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. ఇక బుజ్జి కాన్సెప్ట్‌ నాగ్‌ అశ్విన్‌దేనని చెప్పారు. సుప్రీం యాస్కిన్‌ పాత్ర కోసం ముందుగా కమల్‌హాసన్‌ను అనుకోలేదని షాకింగ్ న్యూస్ చెప్పారు. అర్జునుడిగా విజయ్‌ దేవరకొండతో  సహా మిగిలిన వాళ్లందరినీ తాము ముందునుంచి అనుకున్న నటులతోనే చేసినట్ల చెప్పారు.

    రెండు భాగాలు ఎప్పుడనుకున్నామంటే..
    ‘కథా చర్చల్లో ఉండగానే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. కమల్‌హాసన్‌ ఇందులో భాగం కావడంతో రెండు భాగాలు చేయాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కల్కి పార్ట్‌-2కు సంబంధించి కొంత షూటింగ్ పూర్తయిందని,  పలు కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. దీనికి ఏడాదిపైనే పట్టొచ్చని చెబుతున్నారు.  రెండో భాగం విడుదలపై ప్రస్తుతానికి ఓ తేదీ అంటూ ఏదీ అనుకోలేదన్నారు.  ‘కల్కి2’ వరకే కథ అనుకున్నామని. పార్ట్‌-3పై ఇప్పటికైతే ఆలోచన చేయలేదని చెప్పారు.

    వాళ్లే బలం..
    ‘‘వైజయంతీ మూవీస్‌ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా చేయాలని అనుకోలేదన్నారు. అనుకోకుండా జరిగిందని, పురాణ పాత్రలను కలుపుతూ నాగ్‌ అశ్విన్‌ పకడ్బందీగా కథను రూపొందించాడని చెప్పారు. ఈ మూవీని రికార్డుల కోసం చేయలేదన్నారు. తమ టీమ్‌ అంతా సక్సెస్ ను  ఎంజాయ్ చేస్తుందన్నారు. ఇక సినిమా షూటింగ్‌ టైంలో ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదన్నారు.  అయితే సినిమా తీసేందుకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టగల ధైర్యం ఇచ్చింది మాత్రం హీరో  ప్రభాస్‌, కమల్‌, అమితాబ్‌ బచ్చన్‌లేనని చెప్పారు. పార్ట్-2లో  కమల్‌  పాత్ర బీభత్సం సృష్టిస్తుందని చెప్పారు.  కెరీర్‌లో తనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు అశ్వినీదత్.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    RGV – Kalki : ‘కల్కి’లో చింటూగా ఆర్జీవీ చింపేశాడుగా!

    RGV - Kalki :  తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం...

    Kalki 2898 AD : కల్కి  అంతా ఓకే.. కానీ..

    Kalki 2898 AD : వాయిదాలు పడుతూ వచ్చిన కల్కి 2829...