Male Birth Rate Increased : ఆడ శిశువుల కంటే మగ శిశువుల జననాల రేటు ఏటికేడు పెరుగుతూనే ఉంది. ప్రకృతి లింగ బేధంను ఎప్పుడూ బ్యాలన్స్ చేస్తూనే ఉంటుంది. ఒక సారి ఆడవారి జననాల రేటు పెరిగితే ఒక సారి మగవారి జననాల రేటు పెరుగుతుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం మగవారి కంటే ఆడవారి జనన రేటు ఎక్కువగా ఉండేది. అంటే ప్రతీ 100 మంది అమ్మాయిలకు 93 మండి అబ్బాయిలు మాత్రమే ఉండేవారు. ఇది 90`sలో కొంచెం కలవరానికి గురి చేసింది.
కానీ అది మెల్లగా సర్ధుకుంది. ఒక దశలో 100 మంది అమ్మాయిలకు 100 మంది అబ్బాయిల జనన రేటుగా ఉండేది. అయితే ఇది ఇలాగే కొనసాగితే బాగుండేది కానీ. ఇప్పుడు అబ్బాయిల రేటు ఘననీయంగా పెరుగుతూ అమ్మాయిల రేటు తగ్గుతూ వస్తోంది. అది తెలంగాణలో ఎక్కువగా నమోదవుతుందని లెక్కలు చెప్తున్నాయి.
తెలంగాణలోని ఆసుపత్రుల్లో ఆడపిల్లల కంటే అబ్బాయిలే ఎక్కువగా పుడుతున్నారు. గత నెలలోని ప్రసవాల్లో 52 శాతం అబ్బాయిలే పుట్టగా హైదరాబాద్లో వీరి సంఖ్య 54శాతంగా ఉంది. 78% జిల్లాల్లో ఆడవారి కంటే మగవారి జననాలే ఎక్కువగా నమోదయ్యాయి. జనవరిలో 9855 ప్రసవాలవగా అందులో 8172 సిజేరియన్లే. ఈ లెక్కన గంటకు 11 సిజేరియన్ ఆపరేషన్లు అయ్యాయి. యాదాద్రి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 94 ప్రసవాల్లో 91 C-సెక్షన్లుగా ఉన్నాయి.
ఏది ఏమైనా ఆడ మగ రేషియో సమానంగా ఉన్నప్పుడే సర్కిల్ మంచిగా సాగుతుందని జీవావరణ నిపుణులు చెప్తున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గడం ఉప్పత్తి రేటుపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.