
Ambati Rambabu Counter : స్కిల్ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడికి రాష్ట్ర హై కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం (అక్టోబర్ 31) రోజున రిలీజ్ అవుతున్నాడు. దీంతో టీడీపీ నాయకుడు, చంద్రబాబు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. బాబు బయటకు రావడం తథ్యం అంటూ అప్పుడే చెప్పామని, సత్యం, ధర్మం గెలిచిందంటూ టీడీపీ వర్గం నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబు ఎప్పుడైనా నిప్పు లాంటి వాడని అందుకే న్యాయ స్థానం కూడా ఆయనకు బెయిల్ ఇచ్చిందని చెప్పుకస్తున్నారు. బాబుపై ఎన్ని కేసులు వేసినా నిప్పుకు చెదలు అంటదని వారు కామెంట్లు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
తెలుగు దేశం పార్టీ నుంచి వస్తున్న కామెంట్లు, సంబురాలను చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ నాయకులను, చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్ ఎందుకిచ్చారో తెలుసా? అంటూ టీడీపీ వర్గీయులను ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కేసు విషయం ఇంకా తేలలేదన్న అంబటి కేవలం అనారోగ్య కారణాలతోనే బెయిల్ మంజూరైనట్లు చెప్పారు. దానికే సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది అంటూ కామెంట్లు చేయడం మంచిది కాదన్నారు. ఇది తాత్కాలిక బెయిల్ మాత్రమే అన్న అంబటి నవంబర్ 24వ తేదీ వరకు మాత్రమే ఆయన కేవలం ఇంటి వద్ద లేదంటే హాస్పిటల్ లో మాత్రమే ఉండాలని బయట కనిపిస్తే బెయిల్ రద్దయి మళ్లీ జైలుకు వెళ్తాడని చెప్పారు.
చంద్రబాబు నాయుడికి కన్నుకు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయనకు హై కోర్టు శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకానీ కేసు తేలలేదన్నారు. స్కిల్ కేసు ఇంకా విచారణలో ఉందని అంబటి స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఉన్నత న్యాయస్థానం పునరాలోచించి కొన్ని రోజుల రిలీఫ్ ఇచ్చిందన్నారు. దీనికి టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీ నేతకే మంచిది కదన్నారు. ఆయన కారణంగా ఎటువంటి గొడవలు జరిగినా ఆయన మళ్లీ జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.
నిజం గెలిచి కాదు
బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్!— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023