25.2 C
India
Monday, July 1, 2024
More

    CM Jagan Speech : తొమ్మిదేళ్లుగా అదే డప్పు.. ఏపీ సీఎం జగన్ స్పీచ్ పై జనం విసుర్లు

    Date:

    CM Jagan Speech :
    ఏపీ సీఎం జగన్ ఏ సభకు వెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయన స్పీచ్ మాత్రం మారడం లేదు. ఆయన గతంలో ఐదేళ్లు ప్రతిపక్షనేతగా, నాలుగేళ్లుగా ప్రభుత్వంలో సీఎంగా ఉండి కూడా అదే తీరులో మాట్లాడుతున్నారు. ప్రజలు మాత్రం ఇది విని విని జగన్ ను చూసి నవ్వుతున్నారు. ఆయన మాట్లాడితే చాలు చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అంటూ ఏడుపు మొదలుపెడుతారు. ఇక జనం మాత్రం నిద్రలో కూడా సీఎం జగన్ ఇదే కలువరిస్తున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

    ఏం మాట్లాడిన చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచారని, ఆయన రాష్ర్టానికి ఏం చేయలేదని చెబుతారు. అన్ని సభల్లోనూ పాడిందే పాటగా మాట్లాడుతుంటారు.  ఇక చంద్రబాబు సామాజిక వర్గంపై కూడా ఆయన లేని ద్వేషాన్ని తెచ్చుకొని అన్యాయం చేయడం మొదలుపెట్టారు. తాజాగా సోమవారం నగరి సభలోనూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోకుండా, పొద్దస్తమానం చంద్రబాబును విమర్శించడానికే జగన్ సాకులు వెతుకుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట బటన్ నొక్కే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని విమర్శలు మూటగట్టుకున్నారు.

    అయితే చంద్రబాబు మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని పదే పదే జగన్ మాట్లాడుతున్నారు. కానీ వివేకాను చంపిందేవరో మాత్రం ఆయన మాట్లాడరు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యుడిగా పాల్గొంటే కూడా దానిని రాజకీయం చేశారు. ఓట్ల గల్లంతు అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తే కూడా విమర్శలు చేశారు. తన పార్టీ ఎంపీలను పంపి తాను కూడా సీఈసీకి  ఫిర్యాదు చేయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ఆయన పార్టీ నేతలు చేసిన ఆగడాలను ఇంకా ఏపీ ప్రజలు మర్చిపోలేదు. ఇంత జరుగుతున్నా ఆరోపణలన్నీ టీడీపీ పై వేస్తూ ఆయన కాలం గడుపుతున్నారు. ప్రజలకు అరకొరగా ఇస్తున్న సంక్షేమ పథకాలు తనను కచ్చితంగా గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారు. అయితే ఇటీవల జనం మూడ్ మారుతున్నట్లుగా ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో ఇక మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. దీన్ని చూస్తుంటే జనం మూడ్ చంద్రబాబు వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ...

    AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా...

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    RGV : ఆర్జీవీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

    RGV : ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) గురించి దేశ వ్యాప్తంగా పరిచయం...

    Pawan Kalyan : జగన్ అహం మీద కొట్టిన పవన్ కళ్యాణ్!

    Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన రాజధానిని నీనెందుకు కొనసాగించాలని...

    AP Politics : ఏపీలో అభివృద్ధి తక్కువ.. విధ్వంసం ఎక్కువ

    AP Politics : 2015లో ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు ఏపీలో....